Big Shock Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?
AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ `దేవర` సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
Jr NTR Devara Success Meet: బాక్సాఫీస్ వద్ద 'దేవర'తో నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'దేవర' సినిమా మంచి టాక్‌తో విజయవంతంగా దూసుకెళ్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌కు జోడిగా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే హిట్టయిన సందర్భంగా సంబరాలు చేసుకుందామనుకుంటే రెండూ తెలుగు రాష్ట్రాలు భారీ షాకిచ్చాయి. భారీ స్థాయిలో విజయోత్సవ వేడుక చేయాలనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయి. సక్సెస్ మీట్‌కు పోలీస్ అనుమతులు లభించకపోవడంతో చిత్రబృందం భారీ షాక్‌కు గురయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తెలిపారు.
సినిమా సక్సెస్ మీట్ నిర్వహించుకోలేమంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత నాగవంశీ 'ఎక్స్' వేదికగా ఓ పోస్టు చేశారు. 'బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ సృష్టించడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు. ప్రి రిలీజ్ వేడుక నిర్వహించుకోపోవడంతో ఎన్టీఆర్ అన్న దేవర విజయోత్సవ వేడుక భారీ స్థాయిలో నిర్వహించాలని భావించారు. తెలుగు రాష్ట్రాల అభిమానులను కలుసుకోవాలని అనుకున్నారు. ఎంత తీవ్ర ప్రయత్నిం చేసినా కూడా అనుమతులు లభించకపోయాయి. దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ స్థాయి విజయోత్సవ కార్యక్రమానికి అనుమతి లభించలేదు. అది మన పరిధిలో లేని అంశం. వేడుక నిర్వహించలేకపోతుండడంతో అభిమాన దేవుళ్లకు క్షమించండి అంటూ కోరుతున్నాం. విజయోత్సవ వేడుక నిర్వహించుకునేందుకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మీ ప్రేమతో దేవర బ్లాక్‌బస్టర్ కావాలని.. ఎన్టీఆర్ అన్న మరింత ఎత్తుకు తీసుకెళ్తారని భావిస్తున్నా' అంటూ నాగవంశీ ట్విటర్లో పోస్టు చేశారు.
Also Read: Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్ సమంత స్ట్రాంగ్ వార్నింగ్
అభిమానుల ఆగ్రహం
తమ అభిమాన హీరోకు సంబంధించిన సినిమాకు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతులు ఇవ్వడం లేదని అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవడంతో ఈవెంట్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్ రద్దు రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల అనుమతులు లభించకపోవడం వెనుక కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దసరా ఉత్సవాలను సాకుగా చూపి తమ హీరోను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేధింపులకు గురి చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జంటగా నటించగా.. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో రూ.300 కోట్లతో దేవర సినిమా తెరకెక్కింది. అనిరుధ్ రవిచందర్ సంగీతానికి తోడు బీజీఎం సినిమాను ఉన్నతస్థాయిలో నిలిపింది. ఇప్పటికే రూ.310 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన దేవర రూ.350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.