Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్‌ సమంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Samantha Strong Warning To Minister Konda Surekha: తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగిన మంత్రి కొండా సురేఖఫై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 2, 2024, 08:56 PM IST
Actress Samantha: రాజకీయాల్లోకి నన్ను లాగవద్దు.. కొండా సురేఖకు హీరోయిన్‌ సమంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Samantha Warns To Konda Surekha: తన వ్యక్తిగత జీవితం విషయమై రాజకీయాల్లోకి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటి సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగచైతన్యతో విడాకులకు కేటీఆర్‌ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమంత ఖండించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని.. విడాకులు అనేవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవని స్పష్టం చేశారు. నాపై ఇలాంటి వార్తలు రావడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖపై మండిపడుతూ తన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. మీ రాజకీయాల కోసం మా లాంటి వ్యక్తుల జీవితాలను లాగరాదని హితవు పలికారు. ఒక మంత్రిగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

Also Read: Akkineni Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఆగ్రహం.. సారీ చెప్పాలని డిమాండ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News