Chandrababu Phone Call with his Wife Bhuvanesharai Goes Viral: నందమూరి బాలకృష్ణ పోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభమైంది. ఇక మొట్టమొదటి ఎపిసోడ్ కి హాజరైన చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పలు ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అనేక పర్సనల్ విషయాలను కూడా తన బావ నుంచి అలాగే అల్లుడు నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణిని ఏమని పిలుస్తారు అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా తన సతీమణిని భూ అని పిలుస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాక ఆమెకు ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాలని బాలకృష్ణ కోరగా చంద్రబాబు అలా చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ లో పెట్టారు అన్న విషయం తెలియక భువనేశ్వరి ఇప్పుడు ఏమిటి ఈ ప్రేమ విషయాలు అంటూ ప్రశ్నించడం అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది.


ఇక నారా లోకేష్ భార్య నారా బ్రహ్మాణికి కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ఇప్పటివరకు చెప్పలేదు నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం అని ఖచ్చితంగా అన్ని విషయాలను హ్యాండిల్ చేయగల సమర్థత నీలో ఉందని ఆయన పేర్కొన్నారు. దానికి నారా బ్రాహ్మణి కృతజ్ఞతలు తెలిపింది. ఇక నారా లోకేష్ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసిన నందమూరి బాలకృష్ణ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అన్ని వస్తువులు పట్టుకుని ఇది నాది ఇది నాది అని ఏడుపు ముఖం పెడుతూ ఉండేవాడని అన్నారు.


బహుశా నందమూరి వారి నటనా లక్షణాలు కొంచెం అబ్బి ఉంటాయని పేర్కొన్నారు. దానికి నారా లోకేష్ స్పందిస్తూ మీరు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు, ఇది మా ఇల్లు ఇవన్నీ తీసుకెళ్లి పోతామని కామెంట్ చేస్తుంటే నిజంగా ఎక్కడ తీసుకుపోతారో అని భయంతో అలా అనేవాడిని అని చెప్పుకొచ్చారు. ఇక ఇది నాది ఇది నాది అనడం అలవాటైపోయి మా బ్రాహ్మణిని కూడా దక్కించేసుకున్నావు కదా అంటూ బాలకృష్ణ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.


Also Read: Nara Lokesh on photos: స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో రచ్చ.. మ్యాటర్లోకి బ్రాహ్మణిని లాగుతూ నారా లోకేష్ కామెంట్స్.. టచ్లోనే ఉన్నారట!


Also Read: Priyanth Rao Wife Hulchul: రేప్ కేసులో హీరో అరెస్ట్.. భర్తను దోమలు కుడతాయంటూ భార్య రచ్చ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook