Nara Lokesh Opens upon his Swimming pool Bold photos: తన తండ్రి రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నారా లోకేష్ గురించి తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా ఎన్నికల వ్యూహ రచనలో పాలుపంచుకున్న లోకేష్ ఆ తర్వాత ఎమ్మెల్సీగా మారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయం మీద అనేక ఆరోపణలు ఉన్నా తన పంచాయతీరాజ్ శాఖ తో అనేక అవార్డులు సంపాదించి మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్.
అయితే నారా లోకేష్ గురించి ఎక్కువగా పప్పు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి. తాజాగా ఈ ట్రోలింగ్స్ గురించి అన్ స్టాపబుల్ సీజన్ 2 లో నారా లోకేష్ స్పందించారు. అసలు ఈ ట్రోలింగ్ గురించి ఆలోచించే అవసరమే తనకు లేదని దీని గురించి ఆలోచిస్తే అసలు చేయాల్సిన పని నుంచి డీవియేట్ అవుతామని నారా లోకేష్ పేర్కొన్నారు. అంతేకాక తాను కొంతమంది అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న ఫోటోలను బాలకృష్ణ ప్రదర్శించి ఇదేమిటి అని అడిగితే ఇది కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలని అన్నారు.
కాలేజీ రోజుల్లో అలా ఉండకపోతే ఎలా ? అని ఎదురుప్రశ్నించడమే కాక నాకు వాళ్ళు ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉన్నారు నాకంటే బాగా నారా బ్రాహ్మణి వారితో ఎక్కువ మాట్లాడుతుంది అంటూ నారా లోకేష్ తన స్విమ్మింగ్ పూల్ ఫోటోల వెనుక ఉన్న కథ మొత్తాన్ని వివరించారు.
తాను చదువుకునే రోజుల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని అప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు ఇలా అసెంబ్లీకి, శాసన మండలికి కూడా తీసుకు వస్తారని తాను ఊహించలేదని అన్నారు. ఇదే విషయం మీద మీ అభిప్రాయం ఏమిటి అని నందమూరి బాలకృష్ణ చంద్రబాబుని అడిగితే మామకి లేని నొప్పి నాకెందుకు అంటూ చంద్రబాబు చలోక్తులు విసిరారు. ఇక ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Also Read: Vadinamma Sujitha Dhanush : స్టైలీష్ లుక్కులో వదినమ్మ.. వెకేషన్లో సుజిత.. పిక్స్ వైరల్
Also Read: Priyanth Rao Wife Hulchul: రేప్ కేసులో హీరో అరెస్ట్.. భర్తను దోమలు కుడతాయంటూ భార్య రచ్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook