Chandrababu -Jr NTR: ఎన్టీఆర్ తో భేటీ కానున్న బాబు.. ఎన్నికలే టార్గెట్ గా కొత్త ప్లాన్?
Chandrababu to Meet Jr NTR: 2024 ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు ఎన్టీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Chandrababu to Meet Jr NTR for 2024 Elections Preparation: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సినిమాల్లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ఇప్పటికే ఆయన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో సత్తా చాటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో పక్క ఆయనకు టిడిపి బ్యాగ్రౌండ్ ఉంది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి తన వంతు తాను సాయం చేయాలని భావించారు.
అందుకే 2009 ఎన్నికల్లో ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే 2009 ఎన్నికల్లో ఆయనకి రోడ్డు ప్రమాదాలు కావడం ఆ తరువాత పార్టీ గెలవకపోవడంతో మళ్లీ రాజకీయాల వైపు ఆయన చూడలేదు. దాదాపు ఆయన ప్రచారం చేసి 12 -13 ఏళ్లు అవుతున్నా సరే ఆయన అప్పటి నుంచి సినిమాల్లోనే ఉంటూ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఒకానొక సందర్భంలో తన స్నేహితుడు, అత్యంత ఆప్తుడు అయిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో తనకు కొడాలి నానికి ఎలాంటి సంబంధం లేదని తాను తాత స్థాపించిన పార్టీ కోసం ఎప్పుడూ రెడీగానే ఉంటానని అవసరమనుకున్న సమయంలో తాను వచ్చి పార్టీ కోసం ప్రచారం చేస్తానని కూడా ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన అమిత్ షాతో భేటీ కావడంతో బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బిజెపి ఆయనను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నదా అనే చర్చ కూడా జరిగింది.
అయితే ఈ విషయం మీద కూడా ఎన్టీఆర్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎలాంటి స్పందన బయటకు రాలేదు. ఇక తాజాగా తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు భేటీ అయ్యేందుకు సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకునేందుకు అమెరికా వెళ్లారు. తన భార్య ప్రణతితో కలిసి ఆయన ఇప్పటికే అమెరికాలో ఉండగా ఆర్ఆర్ఆర్ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది.
ఇక ఆయన ఆ పని ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత హైదరాబాదులో చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలని చంద్రబాబు కోరే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ కి ఏదైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు కూడా ఆఫర్ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని అలా చేస్తే ఎన్టీఆర్ ప్రభావం ఆ జిల్లా మొత్తం మీద లేదా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఆఫర్ ను జూనియర్ ఎన్టీఆర్ ఎంతవరకు స్వీకరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook