ఛత్రపతి మూవీ .. ప్రభాస్ సినిమా కెరీర్ బాహుబలి చిత్రానికి ముందు బాహుబలి చిత్రానికి తర్వాత అని చెప్పుకుంటున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రభాస్ పేరెత్తితే కళ్ల ముందు కదిలి చిత్రాల్లో ఛత్రపతి ఒకటి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, హీరోను ఒక రేంజ్‌లో ఎలివేట్ చేయడానికి ఆయన రాసుకునే సన్నివేశాలు ఎలా ఉంటాయనడానికి ఛత్రపతి సినిమా ఓ డిక్షనరి లాంటిది. వెరసి ప్రభాస్, రాజమౌళి కెరియర్స్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న చిత్రం ఛత్రపతి. తెలుగు వారిని ఎంతో ఆకట్టుకున్న ఈ ఛత్రపతి మూవీ తాజాగా హిందీలో రీమేక్ కాబోతోన్నట్టు మనం గతంలోనే చెప్పుకున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛత్రపతి హిందీ రీమేక్ అనగానే అందరికి కలిగే సందేహాలు రెండే.. హిందీ వెర్షన్‌లో ప్రభాస్ పాత్రలో నటించబోయే హీరో ఎవరు ? ఛత్రపతి హిందీ రీమేక్‌ని డైరెక్ట్ చేసేది ఎవరు ? అనే సందేహాలే బుర్రను తొలిచేస్తాయి. ఎందుకంటే ఛత్రపతి లాంటి సినిమాలకు ఈ రెండు అంశాల చాలా ముఖ్యమైనవి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 


[[{"fid":"198941","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bellamkonda-Sai-Sreenivas-in-chatrapathi-Hindi-remake","field_file_image_title_text[und][0][value]":"ఛత్రపతి హిందీ రీమేక్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bellamkonda-Sai-Sreenivas-in-chatrapathi-Hindi-remake","field_file_image_title_text[und][0][value]":"ఛత్రపతి హిందీ రీమేక్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్"}},"link_text":false,"attributes":{"alt":"Bellamkonda-Sai-Sreenivas-in-chatrapathi-Hindi-remake","title":"ఛత్రపతి హిందీ రీమేక్ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Mandana Karimi: హీరోయిన్ దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వెళ్లిన నిర్మాత !


అయితే, తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas ) చిత్రాలు హిందీలో డబ్ అవుతుండటంతో అక్కడ ఆయన చిత్రాలకు కూడా మంచి మార్కెట్ ఉంది. తన హిందీ డబ్బింగ్ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌పై ( Chatrapathi Hindi remake ) కన్నేశాడు. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర‌ప్ర‌సాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్.


తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో సాహో ఫేమ్ సుజీత్ డైరెక్ట్ ( Saaho fame Sujeeth to direct Chatrapathi Hindi remake ) చేయనున్నట్టు మరో ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Also read: Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌కి చిరంజీవి షాక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి