నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాఠక్, సిమ్రాన్ చౌదరి తదితరులు.
సంగీతం : కళ్యాణి మాలిక్
ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
రచన – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.
నిడివి : 140 నిమిషాలు
విడుదల తేది : 26 ఫిబ్రవరి 2021


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Check movie review and rating in Telugu: విభిన్న కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్ట్ చేసిన చెక్ సినిమా ఇవాళ థియేటర్లలోకొచ్చింది. క్రైమ్ డ్రామా జానర్‌లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన చెక్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది Check movie review లో చూద్దాం.


Check movie story - కథ :
చిన్నతనం నుండి మోసాలు చేస్తూ అనాథగా పెరిగిన ఆదిత్య (Nithiin)ను అనుకోకుండా NIA అధికారులకి చిక్కి ఉగ్రవాది అనే ముద్రతో జైలులో అడుగుపెడతాడు. అలా చేయని తప్పుకి జైలుకి వెళ్లి ఉరి శిక్ష వరకు వెళ్ళిన ఆదిత్య.. లాయర్ మానస (Actress Rakul Preet Singh) సహాయంతో శిక్ష నుండి తప్పించుకోవాలని చూస్తుంటాడు. మానసకి తన జీవితంలోకి అనుకోకుండా వచ్చి కనుమరుగైన యాత్ర (Actress Priya Prakash Warrior) గురించి చెప్తూ తన కేసుని వాదించమని కోరుకుంటాడు. ఈ క్రమంలో జైలులో ఉండే శ్రీమన్నారాయణ (Sai Chand) ద్వారా చదరంగం నేర్చుకుంటూ వరుసగా చెస్ పోటీల్లో విజయం సాధించి చివరికి నేషనల్ లెవెల్‌లో మాస్టర్ ప్లేయర్ అనిపించుకుంటాడు. ఇంతకీ ఆదిత్య జీవితంలోకొచ్చిన యాత్ర ఎవరు ?  అతని జీవితాన్ని జైలుకి పరిమితం చేసిన వారు ఎవరు ? చివరికి ఆదిత్య ఉరి శిక్ష నుండి తప్పించుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ.


Technical aspects - నటీ నటుల పనితీరు :
మొదటిసారి ఖైదీ పాత్ర పోషించిన నితిన్ ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. ఛాలెంజింగ్ రోల్‌ని అంతే ఛాలెంజింగ్‌గా చేసి నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. లాయర్ పాత్రలో రకుల్ ఆకట్టుకుంది. కాకపోతే యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో నటిగా మెప్పించలేకపోయింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే కొన్ని సీన్స్ , సాంగ్‌తో సరిపెట్టుకుంది. 


Also read : Chakra movie review: చక్ర మూవీ రివ్యూ


చెస్ ప్లేయర్‌గా సాయి చంద్ నటన బాగుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో చేసిన పోలీస్ క్యారెక్టర్స్ కావడంతో మురళి శర్మ, సంపత్ రాజ్ మరోసారి ఆ రోల్స్‌తో మెప్పించారు. ఆదిత్యతో కలిసి జనాలను మోసం చేసే క్యారెక్టర్‌లో  సిమ్రాన్ చౌదరి డీసెంట్ అనిపించుకుంది. లాయర్ పాత్రలో పోసాని అలరించాడు. శంకర్‌గా హర్ష వర్ధన్, ఆదిత్య స్నేహితుడు స్వామీ పాత్రలో కృష్ణ చైతన్య తమ పాత్రలకి న్యాయం చేశాడు. మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక వర్గం పనితీరు :
క్రైం డ్రామా సినిమాల్లో సన్నివేశాలకు మరింత బలం చేకూర్చే నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. చెక్ సినిమాకి అలాంటి నేపథ్య సంగీతాన్నే అందించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు కళ్యాణీ మాలిక్. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాట Ninnu Chudakunda song కూడా ఆకట్టుకుంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనం బాగుంది. వివేక్ అన్నామలై ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. అనల్ అనిరుద్దన్ ఎడిటింగ్ ఫరవాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియెన్స్‌ని అలరించేలా ఉన్నాయి. చంద్ర శేఖర్ ఏలేటి రాసుకున్న కథ బాగుంది. కానీ కథనం ఆకట్టుకోలేకపోయింది. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.


Also read : Telugu movies releasing today: Check movie, అక్షర మూవీ, క్షణక్షణం, ఏప్రిల్ 28న ఏం జరిగింది, అంగుళీక, 70MM, లాయర్ విశ్వనాథ్


కొందరు దర్శకుల నుండి కొత్త కథలతో సరికొత్త సినిమాలు ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ లిస్టులో Director Chandrasekhar yeleti కూడా ఒకరు. తొలి సినిమా నుండే విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న చంద్ర శేఖర్ ఏలేటి ఈసారి కూడా క్రైం డ్రామాలో స్పోర్ట్‌ని మిక్స్ చేసి ప్రయోగం చేశాడు. కాకపోతే ఆ ప్రయోగానికి మంచి కథనం, ఆసక్తి కలిగించే సన్నివేశాలు, ట్విస్టులు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.


ముఖ్యంగా లాజిక్స్ గాలికొదిలేసి సినిమాను ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో నడిపించాడు. ఒక టెర్రరిస్టుని జైలు అధికారి మాటిమాటికి పిలుస్తూ సరదాగా మాట్లాడటం, అతన్ని మిగతా ఖైదీలాగానే ట్రీట్ చేయడం వంటివి ప్రేక్షకులకు మింగుడుపడవు. ఇక చంద్ర శేఖర్ కథలో రాసుకున్న చెస్ ఎలిమెంట్ కూడా క్రైం డ్రామాలో ఇబ్బందిగా ఇరికించినట్టుగా అనిపించిందే తప్ప సినిమాను నిలబెట్టలేకపోయింది. పైగా జైల్లో ఎంటరయ్యాక హీరో రాత్రికి రాత్రే చెస్ నేర్చుకొని రోజు రోజుకి మాస్టర్‌లా దూసుకుపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. దాంతో క్లైమాక్స్‌కి ముందు వచ్చే చెస్ గేమ్ సన్నివేశాలు కూడా ఆసక్తిగా అనిపించవు. ఇవన్నీ స్క్రిప్టింగ్ స్టేజిలో సరిచేసుకుంటే బాగుండేది.


Also read : kapatadhaari movie telugu review: కపటధారి మూవీ రివ్యూ


యూత్‌ఫుల్ లవ్ స్టోరీ సినిమాల నుండి బయటికొచ్చి ఇలాంటి ప్రయత్నం చేసినందుకు నితిన్‌ని మెచ్చుకోవాలి. నటుడిగా Check movie తో నితిన్ మరోసారి ఆకట్టుకున్నాడు. కాకపోతే పైన చెప్పుకున్నట్లు కథనం వీక్‌గా ఉండటం బలమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు లేకపోవడం, ఫ్లాట్ నెరేషన్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ క్లిక్ అవ్వకపోవడంతో పాటు క్లైమాక్స్ సిల్లీగా అనిపించడం సినిమాకు మైనస్ పాయింట్స్‌గా నిలిచాయి.


Plus points - చెప్పుకోదగినవి :
నితిన్
నేపథ్య సంగీతం
ఫైట్స్
సాంగ్
Minus points - మైనస్ పాయింట్స్ :
బలమైన సన్నివేశాలు లేకపోవడం
ఫ్లాట్ స్క్రీన్ ప్లే
నిడివి
ఫ్లాష్ బ్యాక్


రేటింగ్ : 2.5/5


కర్టసీ: జీ సినిమాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook