Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్

హీరో నితిన్ ( Nithin ) ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే' ( Rang De movie ). ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నితిన్ నటిస్తున్న మరో చిత్రం అంధాధున్ తెలుగు రీమేక్ ( Andhadhun Telugu remake). ఈ సినిమాలో హీరోయిన్లుగా నభా నటేష్, తమన్న భాటియ ( Actress Nabha Natesh, Tamanna Bhatia ) ఖరారైనట్టు ఈ చిత్ర బృందం ఇటీవల అధికారికంగా వెల్లడించారు.

ఇవి రెండు కాకుండా చంద్రశేఖర్ యెలేటి డైరెక్షన్‌లోనూ నితిన్ ఓ సినిమాకు సైన్ చేశాడు. చాలా కాలంగా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు తాజాగా చెక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ప్రీ-లుక్‌ను ఈ రోజు చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ సినిమా స్టోరీ జైలు నేపద్యంలో ఉండబోతోందని పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. Also read : Allu studios inauguration: అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి.. అల్లు స్టూడియో నిర్మాణం

ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే దాదాపుగా పూర్తయింది కానీ సినిమా పేరు మాత్రం ప్రకటించలేదు. ఈ మధ్య ఈ సినిమా గురించి వస్తున్న పుకార్లకు 'చెక్' పెట్టడం కోసమే ఈ రోజు టైటిల్‌ను ప్రకటించారు అని తెలుస్తోంది. ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ థ్రిల్లర్‌ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ( Actress Rakul preet Singh ), ప్రియ ప్రకాష్ వారియర్ ( Actress Priya Prakash Warrior ) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ప్రీ-లుక్ పోస్టర్‌లో నితిన్ చేతికి సంకెళ్ళు వేసి ఉండగా, చెక్ అనే టైటిల్ లోగోలో చదరంగంలోని గుర్రం పావు ( The Knight ) చూడవచ్చు. Also read : Vijay Deverakonda: సౌతిండియాలో ఒకే ఒక్కడు.. విజయ్ దేవరకొండ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

English Title: 
Nithin and Chandrasekhar Yeleti’s film titled Check; Check movie title poster revealed
News Source: 
Home Title: 

Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్

Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్
Publish Later: 
No
Publish At: 
Thursday, October 1, 2020 - 23:11
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini