Chakra movie review: చక్ర మూవీ రివ్యూ

Chakra movie review and rating: విశాల్ సినిమాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఈసారి కూడా విశాల్ తన ట్రాక్ తప్పలేదు. చక్ర పేరిట తన మార్క్ మూవీ వదిలాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కోరుకుంటున్న విజయాన్ని అందించిందా? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Last Updated : Feb 20, 2021, 01:09 AM IST
Chakra movie review: చక్ర మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా, మ‌నోబాల, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
నిర్మాత: విశాల్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్
సెన్సార్: U/A
రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 19, 2021
Chakra movie review and rating: విశాల్ సినిమాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఈసారి కూడా విశాల్ తన ట్రాక్ తప్పలేదు. చక్ర పేరిట తన మార్క్ మూవీ వదిలాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కోరుకుంటున్న విజయాన్ని అందించిందా? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
హీరో సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్రు (Vishal)ది మిలట్రీ కుటుంబం. ఈయన తాత, తండ్రి దేశానికి సేవలందించారు. తండ్రి అశోక చక్ర గౌరవాన్ని కూడా దక్కించుకున్నారు. చంద్రు కూడా మిలట్రీలో ఉంటూ దేశానికి సేవ చేస్తుంటాడు. మరోవైపు విశాల్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి (Shraddha Srinath) సిటీలో పెద్ద పోలీస్ ఆఫీసర్. సిన్సియర్ పోలీసుగా, ఎలాంటి కేసునైనా ఛేధించే ఆఫీసర్‌గా పేరుతెచ్చుకుంటుంది. సరిగ్గా ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్ సిటీలో వరుసపెట్టి దొంగతనాలు జరుగుతాయి. గంటల వ్యవధిలో 50 ఇళ్లు కొల్లగొడతారు దొంగలు. అందులో విశాల్ నాయనమ్మ ఇల్లు కూడా ఉంటుంది. అదే సమయంలో చంద్రు అత్యంత విలువైనదిగా భావించే అశోక చక్ర మెడల్‌ను కూడా దొంగలు కొట్టేస్తారు. దీంతో ఇటు గాయత్రితో పాటు అటు చంద్రు కూడా రంగంలోకి దిగుతారు. వరుస దొంగతనాల వెనక పెద్ద సైబర్ క్రైమ్ ఉందనే విషయాన్ని గ్రహిస్తారు. ఇంతకీ ఆ సైబర్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కంటికి కనిపించకుండా తిరుగుతున్న ఆ సైబర్ దొంగను విశాల్ పట్టుకున్నాడా లేదా? తన తండ్రికి చెందిన అశోక చక్రను తిరిగి దక్కించుకున్నాడా లేదా అనేది చక్ర కథ

నటీనటుల పనితీరు:
విశాల్‌కు ఇలాంటి కథలు కొత్త కాదు. మరీ ముఖ్యంగా ఇంతకుముందు దాదాపు ఇలాంటి కథతోనే అభిమన్యుడు సినిమా చేశాడు. ఈ సినిమాలో అతడికి సవాల్ విసిరే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో అతడు ఆడుతూపాడుతూ నటించేశాడు. సినిమాను ఒంటి చేత్తో బాగానే నడిపించాడు కానీ, అతడి యాక్టింగ్‌లో కొత్తదనం లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్ధ శ్రీనాధ్ ఓకే అనిపిస్తుంది. ఇక మరో హీరోయిన్ రెజీనా మాత్రం తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. రోబో శంకర్, మనోబాల, కేఆర్ విజయ్ తమ పాత్రల మేరకు నటించారు.

Also read : kapatadhaari movie telugu review: కపటధారి మూవీ రివ్యూ
టెక్నీషియన్స్ పనితీరు:
దర్శకుడు ఆనందన్ కొత్త కథ తీసుకోలేదు. ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న కథకే తనదైన సన్నివేశాలు, యాక్షన్ జోడించాడు. అతడు రాసుకున్న కథ, చాలాచోట్ల స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉంది. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ తన ప్రొడక్షన్ వాల్యూస్‌ను మరోసారి నిలబెట్టుకుంది. ఖర్చుకు వెనకాడకుండా డబ్బు ఖర్చు పెట్టారు.

ఇదివరకే అభిమన్యుడు లాంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌ను చేసిన విశాల్‌ను, అలాంటిదే మరో కథతో ఒప్పించినందుకు దర్శకుడు ఆనందన్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే, చక్రలో ఫస్టాఫ్ మొత్తం Abhimanyudu కనిపిస్తాడు. అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా హీరో-విలన్ మధ్య పిల్లి-ఎలుక ఆటను చూపించాడు దర్శకుడు. విలన్ ఎత్తులు వేయడం, దాన్ని హీరో చిత్తు చేయడం ఆఖరి వరకు కనిపిస్తుంది. కాకపోతే Abhimanyudu movie లో మగ విలన్ అయితే, ఇందులో లేడీ విలన్ అంతే తేడా.

ఒకే రోజు 50 దొంగతనాలు జరిగాయనే పాయింట్‌ను దర్శకుడు తీసుకున్నాడు. దానికి సైబర్ క్రైమ్ కోణం యాడ్ చేశాడు. ఇక సీన్‌లోకి దిగిన హీరో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఈ ఎపిసోడ్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అనవసరమైన సీన్లు, పాటలు లేకుండా క్రిస్పీగా స్క్రీన్ ప్లే నడించాడు. కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు కథలో కొత్తదనం లేకపోవడం, సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్ట్ లోపించడం చక్రకు పెద్ద మైనస్ అయింది. చివరికి విశాల్‌ను ఇందులో కూడా ఆర్మీ ఆఫీసర్ (అభిమన్యుడులో కూడా మిలట్రీ) గా చూపించడం రొటీన్ అనిపిస్తుంది. దీనికితోడు పోలీసులందర్నీ పక్కనపెట్టి.. ఓ ఆర్మీ ఆఫీసర్‌తో కేసును సాల్వ్ చేయించడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. ఇంత ప్రయాస పడిన బదులు హీరోను కూడా పోలీసాఫీసర్‌గా చూపించేస్తే సరిపోయేది. Ashok Chakra ఎపిసోడ్ కోసం హీరోను మిలట్రీగా చూపించిన దర్శకుడు.. ఆ పాత్రకు మిలట్రీ బ్యాక్‌డ్రాప్ సరిపోదని తెలిసి కూడా, అభిమన్యుడు ఇచ్చిన ధైర్యంతో కథను నడిపించేశాడు.

Also read : Uppena movie review: ఉప్పెన మూవీ రివ్యూ, రేటింగ్

విశాల్ ఆర్మీ ఆఫీసర్‌గా సరిపోయాడు. కానీ అతడు తన కథల ఎంపికతో పాటు గ్లామర్‌పై కూడా కాస్త దృష్టిపెట్టాల్సిన టైమ్ వచ్చింది. విశాల్ తన కండలపైనే కాకుండా, ముఖంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఫ్యూచర్‌లో అతడు ఇలాంటి యాక్షన్ కథలకు తప్పితే మరో జానర్‌కు పనికిరాకుండా పోతాడు. మొత్తంగా చూసుకుంటే, Chakra movie లో కొత్తగా మనకు ఏదీ కనిపించదు. ఓ Cyber crime ను బోర్డర్ నుంచి వచ్చిన మిలట్రీ ఆఫీసర్.. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పక్కనపెట్టి ఎలా ఛేదించాడనేది మాత్రం చూపించారు. సినిమాలో ప్రతి సీన్ ఊహించుకునేట్టుగానే ఉంటుంది. దీంతో ఇదొక యావరేజ్ యాక్షన్ డ్రామాగా.. అభిమన్యుడుకు డూప్లికేట్‌గా తయారైంది.

బాటమ్ లైన్ – చక్ర అలియాస్ అభిమన్యుడు
రేటింగ్ – 2.5/5
కర్టసీ: జీ సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News