Vidyarthi Movie : గుళ్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కాలేజీల్లో విద్యార్థి టీం
Vidyarthi Movie Promotions విద్యార్థి మూవీ రేపు థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాను వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.
Vidyarthi Movie Promotions కొత్త కథలతో వచ్చే చిత్రాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చేతన్ చీను, బన్నీవోక్స్ జంటగా నటించిన ‘విద్యార్థి’ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లోకి రాబోతోంది.
మహాస్ క్రియేషన్స్ పతాకంపై మధు మాదాసు దర్శకత్వంలో రాబోతోన్న సినిమాను ఆళ్ల వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల అభిమానులను కలిసి సినిమా ముచ్చట్లను వివరిస్తున్నారు. తాజాగా చిత్ర హీరో చేతను చీను బృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు.
అనంతరం మంగళగిరి, గుంటూరు, అమరావతి, పల్నాడు, వైజాగ్, విజయనగరం ఇలా పలు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులను కలిసి సందడి చేశాడు. ఈ మూవీ దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ.. దర్శకుడిగా తొలి చిత్రమని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను చాలా కష్టపడి తీశామని తెలిపాడు. ఎక్కడా బ్రేక్ లేకుండా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశామని అన్నాడు.
Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్
చేతను చీను మాట్లాడుతూ.. ప్రతి ప్రాంతంలోనూ జరిగే ఓ అంశాన్ని తీసుకుని దర్శకుడు కథ రాశారని, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు. కనకదుర్గమ్మని దర్శించుకున్నామని, ఆ తర్వాత అప్సల్యూట్ సాఫ్ట్వేర్ కంపెనీ, భాష్యం కాలేజ్, మహాత్మా గాంధీ కాలేజ్, ఆక్సి్ఫార్డ్స్ విట్, సీతం కాలేజీలోని విద్యార్థులను కలిశామని చెప్పుకొచ్చాడు. సినిమా ట్రైలర్ చూసి వారంతా చాలా ఎగ్జైట్ అయ్యారని అన్నాడు. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చాడు ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Also Read: Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook