Acharya movie is postponed due to novel Coronavirus pandemic: 'మెగాస్టార్' చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య (Acharya) సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచార్య  విడుదల కోసం మెగా అభిమానులు (Mega Fans) ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. గతేడాదే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 2022 ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల అవుతుందని మెగా ఫాన్స్ సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఆచార్య సినిమా మరోసారి వాయిదా పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆచార్య సినిమా విడుదల వాయిదా (Acharya Postponed) వేశామని చిత్ర బృందం శనివారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది. 'కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆచార్య సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిసస్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరోనా రూల్స్ పాటిస్తూ అందరూ జాగ్రతగా ఉండండి' అని కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన మెగా ఫాన్స్ నిరాశకు గురయ్యారు. పాన్‌ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది.


Aslo Read: అలానేనా ప్రవర్తించేది.. విరాట్ కోహ్లీకి జరిమానా విధించాలి లేదా సస్పెండ్ చేయాలి! ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్!!




స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ (Ram Charan) నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆచార్యలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్‌ బంపర్ హిట్ అయ్యాయి. 


Also Read: GiveNewsNotViews: ట్రెండింగ్‌లో చిరంజీవి ట్వీట్‌.. తన మద్దతు చిరుకే అంటున్న విజయ్ దేవరకొండ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook