Bholaa Shankar Shoot Starts సంక్రాంతి సందడి ముగిసింది. ఆల్రెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడేస్తున్నాయి. ఇక కొత్త సినిమాలేవీ ఇప్పుడు రావడం లేదు. పెద్ద హీరోలు ఈ మధ్య వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు అన్నీ సెట్స్ మీదున్నాయి. మహేష్‌ బాబు త్రివిక్రమ్ సినిమా రేపు సెట్స్ మీదకు వెళ్తోంది. చిరంజీవి చేతిలో ఒప్పుడు ఒకే ఒక ప్రాజెక్ట్ ఉంది. భోళా శంకర్ అంటూ రాబోతోన్న ఈ సినిమాను మెహర్ రమేష్‌ తెరకెక్కిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వీరయ్య సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో కలెక్షన్ల మోత మోగిపోతోంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ చిరంజీవి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలకు నష్టాలు రావడంతో ఇకపై చిరంజీవి సినిమాలకు బిజినెస్ జరగదా? అని అంతా అనుకున్నారు. కానీ వాల్తేరు వీరయ్య విజయం చూసి అంతా షాక్ అవుతున్నారు.


ఇప్పుడు చిరంజీవి చేస్తోన్న భోళా శంకర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నేడు హైద్రాబాద్‌లోని కోల్ కతా సెట్ వేశారు. నేటి నుంచి షూటింగ్ ప్రారంభం అయింది. మరో వైపు మహేష్‌ బాబు త్రివిక్రమ్ సినిమా కూడా ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.


మొదటి రోజే మహేష్‌ బాబు కూడా జాయిన్ కాబోతోన్నాడట. ఈ సినిమా కోసం మహేష్ బాబు రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుందని, ఇక రెండో భాగంలో మహేష్‌ బాబు రగ్డ్ లుక్‌లో, గడ్డం, ఎక్కువ జుట్టుతో కనిపిస్తాడట. అసలే అతడు, ఖలేజా తరువాత వీరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఆల్రెడీ ఓ కథను వద్దని చెప్పడం, మళ్లీ ఇంకో కొత్తను త్రివిక్రమ్ రెడీ చేయడంతో మహేష్‌ బాబు సంతృప్తి చెందాడట.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook