Chiranjeevi Waltair Veerayya చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 1.7 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. దెబ్బకు బ్రేక్ ఈవెన్ అయింది. చిరంజీవి స్టామినా మరోసారి ఇలా అందరికీ ఫ్రూవ్ చేసినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చిరంజీవి తాజాగా ఓ సీన్ గురించి చెప్పుకొచ్చాడు. వెన్నెల కిషోర్‌తో చేసిన ఓ సీన్ గురించి ఇప్పుడు చిరు బయట పెట్టేశాడు. వాల్తేరు వీరయ్యలో వెన్నెల కిషోర్‌తో చిరంజీవిది ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. పల్లీల పొట్టుని వెన్నెల కిషోర్ మొహం మీద విసిరేస్తాడట. అయితే ఈ సీన్‌ను ఉదయం పూటే షూట్ చేశారట.


 



ఉదయం ఏడు గంటలకు సెట్‌లో పల్లీల పొట్టు ఉంటుందో లేదో అని చిరంజీవే తన ఇంట్లోంచి పట్టుకొచ్చాడట. ఆ రోజు ఇంట్లో సురేఖ లేదని, వంట మనిషిని వేరుశనక్కాయల పొట్టు రెడీ చేసివ్వమని అడిగాడట. చిరంజీవి ఏం అడుగుతున్నాడో అర్థం కాక ఆ పని మనిషి తెల్లమొహం వేసిందట.


ఏంటి అయ్యా? అని అమాయకంగా అడిగిందట. ఆమెకు సీన్ గురించి చెప్పలేడు.. వెన్నెల కిషోర్‌తో సీన్ ఉందని, ఆ పొట్టు కావాలని చెప్పలేని చిరంజీవి తన పని మనిషికి అర్థమయ్యేలా వేరుశనక్కాయల పొట్టు కావాలని చెప్పాడట. ఏంటి అయ్యగారికి ఏమైనా పిచ్చి పట్టిందా? అని ఆ పని మనిషి అనుకుని ఉంటుందని చిరు నవ్వుతూ ఆ ఘటన గురించి చెప్పుకొచ్చాడు.


మొత్తానికి వాల్తేరు వీరయ్య సక్సెస్‌ను మాత్రం చిరంజీవి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఆచార్య, గాడ్ ఫాదర్‌ల దెబ్బ ఈ వీరయ్యతో పోయేట్టుగా ఉంది. ఆల్రెడీ ఈ సినిమా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయింది. రెండు మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేయబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఇప్పటికే అరవై శాతం వరకు రికవరీ చేసినట్టుగా కనిపిస్తోంది.


Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్


Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook