Bluff Master: కరోనా ( Coronavirus ) టైం కావడంతో సినీ ఇండస్ట్రీ (Cine industry) అంతా ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలో చాలామంది హీరో, హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంటే.. మరికొంత మంది సెలబ్రిటీలు పాత, కొత్త సినిమాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ).. కూడా కరోనా టైం కావడంతో  ఇంట్లోనే ఉంటూ పలు సోషల్ అవెర్‌నెస్ వీడియోలను చేస్తూ అవగాహాన కల్పించడమే కాకుండా.. పలు సినిమాలను సైతం వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన 2018లో విడుదలైన ‘బ్లఫ్ మాస్టర్’ ( Bluff Master ) సినిమాను చూసి ఆ చిత్ర దర్శకుడు గోపీ గణేష్‌ (Gopi Ganesh) ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. అయితే టాలెంట్ ఉన్నవారిని మెచ్చుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. Also read: ప్రభాస్‌కు రాణి దొరికింది.. పిచ్చెక్కిద్దాం అంటున్న డైరెక్టర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయాన్ని బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి స్వయంగా చిరంజీవి అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన ఏమిటో మరొమారు తెలిసింది. నా గురించి, సినిమా గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను.. ఆయనకు ధన్యవాదాలు..  అంటూ గోపీ గణేష్ ఈ ట్వీట్‌లో రాశారు.



2018లో విడుదలైన బ్లఫ్ మాస్టర్ సినిమాలో.. సత్యదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలాఉంటే.. ఫొటోలో చిరంజీవి న్యూలుక్ ప్రస్తుతం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. Also read: Nithin Marriage: నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్