ప్రభాస్‌కు రాణి దొరికింది.. పిచ్చెక్కిద్దాం అంటున్న డైరెక్టర్

Prabhas 21 Movie Updates | దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 19, 2020, 03:08 PM IST
ప్రభాస్‌కు రాణి దొరికింది.. పిచ్చెక్కిద్దాం అంటున్న డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అప్‌డేట్ వచ్చేసింది. ప్రభాస్ 21వ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే‌ను కన్ఫామ్ చేసినట్లు ప్రకటించారు. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. Nepotism: నేను బాధితురాలినే: సాహో నటి

తొలుత మరో బాలీవుడ్ నటి అలియా భట్‌ను తీసకుందామని ఆలోచించారు. చివరికి  ‘పద్మావత్’ ఫేమ్ దీపికా పదుకొనే ఫైనల్ అయింది. వైజయంతీ మూవీస్ తమ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి చిన్న ప్రోమోను సైతం రిలీజ్ చేసి ప్రేక్షకులలో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సినిమాను త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్     

దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది. Eevelyn Sharma Hot Photos: సాహో బ్యూటీ అందాల సునామీ 

మరోవైపు ప్రభాస్ 20వ సినిమా రాధేశ్యామ్ చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే జోడీ కట్టింది. బాహుబలి, సాహో తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ రెండు సినిమాలపై భారీగానే అంచనాలున్నాయి.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News