Chiranjeevi urban monk look secret: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంటారు. అయితే.. రీసెంట్‌గా చిరంజీవి (Megastar Chiranjeevi) గుండు లుక్‌  ( urban monk look) తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. న్యూలుక్ ఫొటోను మెగాస్టార్ అలా షేర్ చేయగానే.. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా మారారు అనే ఆసక్తి అంతటా పెరిగింది. మెగాస్టార్ 152వ సినిమా 'ఆచార్య'లో అర్బన్‌ మాంక్‌ లుక్‌లో కనపించనున్నారని.. మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి తన గుండు లుక్‌ వెనకున్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టి.. అభిమానులకు షాక్ ఇచ్చారు. అసలు అర్బన్‌ మాంక్‌ గెటప్‌లోకి మారిన విషయాన్ని వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పంచుకున్నారు. Also read : Chiranjeevi’s sister: చిరంజీవికి సోదరిగా వరుణ్ తేజ్ హీరోయిన్ ?



ఈ వీడియోను షేర్ చేయడంతోపాటు మెగాస్టార్ ఈ విధంగా రాశారు. ఏ రూపాన్ని అయినా.. నిజమని నమ్మేలా చేసే ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌ అంటూ.. చిరు వీడియోను పంచుకున్నారు. ఈ తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టిన మెగాస్టార్.. ఈ లుక్ ఏ సినిమా కోసం అనే విషయాన్ని వెల్లడించలేదు. Also read: Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?