Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?

Chiranjeevi new look in gundu: మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఉగాది రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా సైట్స్ ద్వారా చిరు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు.

Last Updated : Sep 11, 2020, 12:40 AM IST
Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?

Chiranjeevi new look in gundu: మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఉగాది రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా సైట్స్ ద్వారా చిరు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు. రీసెంట్‌గా తన కొత్త లుక్స్‌తో అందరిని ఆకట్టుకున్న చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త ఫొటోను షేర్ చేశారు. Also read : SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్



View this post on Instagram


#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

చిరంజీవి గుండుతో ఉన్న న్యూ లుక్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఆ ఫొటోకి క్యాప్షన్ 'కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్ ?' అని రాసుకొచ్చారు. దానికి రాంచరణ్ ( Ram charan ) స్పందిస్తూ 'అప్ప, నేను చూసింది నిజమేనా' అన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ రాశాడు. ఇంతకి ఈ లుక్స్ మూవీ కోసమేనా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో చిరు తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నట్టున్నారు అని కామెంట్స్ రాశారు. చిరు గుండు లుక్ వెనుకున్న అసలు కథ ఏంటి అనేది మాత్రం చిరునే చెప్పాలి. Also read : Rana Daggubati movies: రానా దగ్గుబాటి చేతికే సురేష్ ప్రొడక్షన్స్ ?

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో ( Acharya movie ) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య మూవీ తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో వెథలం తెలుగు రీమేక్ మూవీ ( Vedhalam Telugu remake ), లూసిఫర్ అనే మలయాళం మూవీని తెలుగులో రీమేక్ ( Lucifer telugu remake ) చేయనున్నారు. Also read : Chiranjeevi’s sister: చిరంజీవికి సోదరిగా వరుణ్ తేజ్ హీరోయిన్ ?

Trending News