Chiranjeevi Satires on Waltair Veerayya Ratings మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం అక్కడ రెండు మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. 2.5 మిలియన్ల డాలర్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌ వరకు ఆ ఫీట్‌ను వీరయ్య సాధించేలానే కనిపిస్తున్నాడు. అయితే వాల్తేరు వీరయ్య సినిమాను అక్కడి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్‌ హిట్‌ను చేయడంతో వారితో ప్రత్యేకంగా ముచ్చటించాడు చిరంజీవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన రోజున ఓవర్సీస్‌లో కావాలనే నెగెటివ్ టాక్‌ను, రివ్యూలను స్ప్రెడ్ చేశారు. రేటింగ్‌లను దారుణంగా వేశారు. అయినా అవేవీ వీరయ్య విధ్వంసాన్ని ఆపలేకపోయాయి. మొదటి రోజు నుంచీ వీరయ్య బాక్సాఫీస్ మీద దండ యాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా లాభాల బాట పట్టేసింది. 120 శాతం రికవరీ చేసినట్టుగా సమాచారం అందుతోంది.


 



ఈ క్రమంలో వీరయ్య సినిమాకు ఇచ్చిన రేటింగ్‌ల మీద చిరంజీవి స్పందించాడు. ఎన్నారై ఆడియెన్స్‌తో మాట్లాడుతూ రేటింగ్‌ల కౌంటర్లు వేశాడు. ఈ సినిమాకు 2, 2.25, 2.5లు ఇచ్చారు.. అప్పుడు నాకు అర్థం కాలేదు.. ఇప్పుడు అర్థమైంది.. అవన్నీ మిలియన్ డాలర్లు అని అంటూ నవ్వుతూ చురకలు అంటించాడు. అంటే రేటింగ్‌లతో జనాలు ఇంపాక్ట్ అవ్వరని ఇలా చిరు పరోక్షంగా సెటైర్లు వేశాడు.


వీర సింహా రెడ్డి సినిమా ఒక రోజు ముందుగానే రిలీజ్ అయినా కూడా కలెక్షన్లలో మాత్రం వాల్తేరు వీరయ్య దుమ్ములేపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాల్తేరు వీరయ్య సినిమానే బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని చూపిస్తోంది. సంక్రాంతి విన్నర్‌గా చిరంజీవి నిలిచి తన సత్తా ఏంటో మరోసారి చాటాడు.


Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే


Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి