యాంకర్ ప్రదీప్ మాచిరాజుకి మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇచ్చారట. తాను అప్పుడప్పుడే యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న రోజుల్లో ఓసారి అనుకోకుండా మెగాస్టార్ చిరు ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చిన యాంకర్ ప్రదీప్... అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు. చిరంజీవి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన షాక్‌తో తనకు కొన్నాళ్లపాటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని యాంకర్ ప్రదీప్ వెల్లడించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి ఇంటికి వెళ్లినపుడు తనను ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకున్న తీరు చూసి తాను ఫిదా అయిపోయానంటున్నాడు యాంకర్ ప్రదీప్. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్‌డమ్ ఉన్న అంతపెద్ద నటుడు తనలాంటి చిన్న యాంకర్‌తో అంత మర్యాదగా ప్రవర్తించిన తీరు చూశాక చిరంజీవి అంత ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నాడో అర్థమైందని యాంకర్ ప్రదీప్ వివరించాడు. అవతలి వారి స్థాయితో సంబంధం లేకుండా, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఒకేలా గుర్తించి మర్యాద ఇవ్వడం చిరంజీవికి ( Chiranjeevi Konidela ) బాగా తెలుసని.. అది తనను రిసీవ్ చేసుకున్న తీరులోనే తెలిసిపోయిందని చెప్పుకొచ్చాడు. 


Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?


ఆ తర్వాత చిరంజీవిని ఎన్నోసార్లు కలిశానని.. కానీ ఆయన మర్యాదలో మాత్రం మార్పు రాలేదని చెప్పిన యాంకర్ ప్రదీప్.. కలిసిన ప్రతీసారి చిరంజీవిలో అదే మర్యాదను చూశానని తెలిపాడు. తన యాంకరింగ్ బాగుంటుందని.. ముఖ్యంగా పదాలను ఉచ్చరించే తీరు స్పష్టంగా ఉంటుందని చిరంజీవి ఇచ్చిన కితాబు తన జీవితంలో మర్చిపోలేనని యాంకర్ ప్రదీప్ ( Anchor Pradeep ) ఆనందం వ్యక్తంచేశాడు.


Also read : Naga Chaitanya Birthday: ‘లవ్ స్టోరీ’ మూవీ పోస్టర్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి