Tollywood: టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో ఓ కొలిక్కి రానున్నాయి. మెగాస్టాస్ట్ చిరంజీవి నేతృత్వంలోని బృందం..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ఖరారైంది. టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసమే ఈ భేటీ ఏర్పాటైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్(Tollywood) ప్రస్తుతం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ టికెట్ల ధరలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా చాలానే ఉన్నాయి. థియేటర్ టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యంలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందానికి భేటీని ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవి(Chiranjeevi) మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడంతో పాటు పలు ఇతర నిర్ణయాల్ని చిరంజీవి స్వాగతించారు. 


ఇప్పుడు త్వరలో జరగనున్న భేటీలో చిరంజీవి బృందం రాష్ట్రంలోని థియేటర్ టికెట్ల సమస్య, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ నెల 20వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో(Ap cm ys jagan) చిరంజీవి భేటీకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. సాధారణ టికెట్ కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. గత కొద్దికాలంగా ఏపీలో ఎటువంటి బెనిఫిట్ షోలకు అనుమతివ్వడం లేదు. అదే ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. చిరంజీవితో పాటు నాగార్జున, దిల్‌రాజు, సురేష్ బాబులు కలవనున్నారు. పట్టణాలు , నగరాల్లో రోజుకు నాలుగు షోలు రన్ చేసేలా వీలు కల్పించాలన్నారు. అదే విధంగా గ్రేడ్ 2 కేంద్రాల్లో నేల టికెట్ పది రూపాయలు, కుర్చీకు 20 రూపాయలు చేసేందుకు అనుమతి కోరనున్నారు. మరోవైపు ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలనే నిర్ణయంపై సమీక్ష కోరనున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా టికెట్స్ విక్రయించేందుకు అనుమతి అడగనున్నారు. 


Also read: TTD Members List: రెండు మూడు రోజుల్లో సిద్ధం కానున్న టీటీడీ పాలక మండలి జాబితా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook