Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే చాలు అభిమానులకు ప్రత్యేక ఉత్తేజం కలుగుతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త హల్‌చల్ అవుతోంది. కారణం చిరు ఎవరిని ఫాలో అవుతున్నారనేది తెలియక. ఫాలోవర్ల సంఖ్య ఎందుకు మారుతోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌(Chiranjeevi Twitter Account) చాలా యాక్టివ్. గత ఏడాది అంటే 2020 ఉగాది నాడు ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన చిరు తనదైన శైలిలో సెటైర్లు, కౌంటర్లకు ట్విట్టర్‌లో క్రేజ్ పెరిగింది. చిరంజీవిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య మిలియన్‌కు చేరువలో ఉంది. చిరుని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కానీ చిరు ఫాలో అయ్యేవారి సంఖ్య విషయంలో మాత్రం సందేహం తలెత్తుతోంది. చిరు ట్విట్టర్‌లో ఎవరిని ఫాలో అవుతున్నారనేది తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటివరకూ చిరు ఫాలో అయ్యేవారి సంఖ్య 1 మాత్రమే ఉండేది. ఆ ఒక్కడి కొడుకు రామ్‌చరణ్. మరెవ్వర్నీ చిరు ఫాలో అయ్యేవాడు కాదు. 


అయితే తరువాత ఏమైందో తెలియదు గానీ.. రామ్‌చరణ్‌(Ram charan)ను అన్ ఫాలో అయ్యాడు. తరువాత ఆ స్థానంలో ప్రముఖ పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి పేరు చేరింది. చిరు ఫాలో అయ్యే ఏకైక వ్యక్తిగా రామ జోగయ్య నిలిచారని నెటిజన్లు ప్రశంసించారు. అటు రామ జోగయ్య శాస్త్రి సైతం స్పందించి ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పటికీ రుణపడి ఉంటానని..కొండంత అండగా ఉంటానని భావోద్వేగానికి గురయ్యాడు. అయితే అతని ఆనందం, భావోద్వేగం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. చిరంజీవి ఫాలోవర్ల సంఖ్య మరోసారి జీరోగా మారింది. రామ జోగయ్య శాస్త్రి(?Rama Jogaiah sastry)ని అన్‌ఫాలో అయ్యాడు. ఇదంతా చిరంజీవి(Chiranjeevi) స్వయంగా చేస్తున్నాడా లేదా అని టీమ్ చేస్తుందా అనేది తెలియదు కానీ..మెగాస్టార్ చిరంజీవి ఎవరిని ఫాలో అవుతున్నాడనేది అర్ధం కావడం లేదు. 


Also read: Pushpa movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప యూనిట్ గుడ్ న్యూస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook