Waltair Veerayya Overseas Collections మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల మధ్య ఇప్పుడు పోటీ రసవత్తరంగా మారింది. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలో పోటాపోటీగా నడుస్తున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడం, వీర సింహా రెడ్డికి మిక్స్డ్‌ టాక్ రావడంతో కలెక్షన్లతో తేడా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఓవర్సీస్ కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో వీర సింహా రెడ్డి ముందున్నాడని, చిరంజీవి సినిమాను పట్టించుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓవర్సీస్‌లో వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్లలో దుమ్ములేపేస్తోందని సమాచారం అందుతోంది.


ఇప్పటికే వీరయ్య సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరినట్టు కనిపిస్తోంది. ప్రీమియర్స్, డే వన్, డే 2 కలెక్షన్లు కలిపి చూస్తే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం ఈ ఫీట్‌కు ఇంకా చాలా దూరంలోనే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అసలే వన్ మిలియన్ మార్క్‌ను చేరేందుకు ఎంతో మంది కిందా మీద పడుతుంటారు.


చిరంజీవి మాత్రం వాల్తేరు వీరయ్యతో రెండు రోజుల్లోనే ఆ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పుడు బాలయ్య కూడా ఆ ఫీట్‌ను అందుకునేందుకు రెడీగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ చిరంజీవి మాత్రం రెండు రోజుల్లోనే వన్ మిలియన్ క్లబ్బులోకి చేరింది. ఆ ఫీట్‌ను అందుకునేందుకు వీర సింహా రెడ్డికి ఇంకో రోజు పడేట్టుగా ఉంది.


వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ రఫ్పాడిస్తున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి