Chiranjeevi YS Jagan meet Megastar Chiranjeevi meets AP CM YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో (AP CM YS Jagan Mohan Reddy) హీరో మెగాస్టార్‌ చిరంజీవి (Megastar‌ Chiranjeevi) తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన తాడేపల్లికి వెళ్లారు. చిరంజీవి, (Chiranjeevi) జగన్ (Jagan) మధ్య మర్యాదపూర్వక లంచ్‌ భేటీ జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను ఇండస్ట్రీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ను (CM YS Jagan) కలిసేందుకు వచ్చానని చిరంజీవి పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌ ఆహ్వానం మేరకు తాను తాడేపల్లికి వచ్చినట్లు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar‌ Chiranjeevi) తెలిపారు. ముందుగా బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లిన చిరంజీవి అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి (CM camp office) వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. 


ఇక అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినిమా (Cinema) అంశాలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు తాను విజయవాడ వచ్చా అని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా తాను సీఎంతో మాట్లాడతాను అని అన్నారు. ఇక సీఎంతో భేటీ తర్వాత అన్ని విషయాలు వివరిస్తాను అని కూడా చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు. గంటన్నరలో సీఎంతో చర్చించిన అన్ని విషయాలను మీకు చెబుతాను అని చిరు పేర్కొన్నారు. 



Also Read : Rashmika - Pushpa 2: మీకు వాగ్దానం చేస్తున్నా.. పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే ఈ భేటీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించే చిరంజీవి ప్రధానంగా సీఎం జగన్‌తో చర్చించారు అని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదంపై (Movie ticket controversy) వీరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గింపు వివాదం రోజురోజుకు ముదురుతోన్న నేపథ్యంలో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు చిరు సీఎంతో భేటీ అయ్యారని తెలుస్తోంది. 


 


ఇక చిరంజీవి మొత్తం సినీ ఇండస్ట్రీ తరఫున ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడేందుకు వెళ్లారని హీరో నాగార్జున (Hero Nagarjuna) పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తాను, చిరంజీవి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. వారం రోజుల కిందటే చిరు తనకు ఫోన్‌ చేసి సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్తున్నా అని చెప్పారని నాగ్ తెలిపారు. సీఎం జగన్‌తో (CM Jagan‌) చిరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఇండస్ట్రీకి (Industry) అంతా మంచే జరుగుతుందని చెప్పారు. కాగా చిరంజీవి (Chiranjeevi) భేటీ తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీ పెద్దలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.


Also Read : పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' కథ లీక్.. అసలు పాయింట్ చెప్పేసిన హీరోయిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook