Harihara Veeramallu: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' కథ లీక్.. అసలు పాయింట్ చెప్పేసిన హీరోయిన్

Pawan Kalyan's Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా కథ లీకైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 02:42 PM IST
  • పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కథ లీక్
  • ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కథ గురించి చెప్పేసిన నిధి అగర్వాల్
  • వీరమల్లు కథపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
 Harihara Veeramallu: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' కథ లీక్.. అసలు పాయింట్ చెప్పేసిన హీరోయిన్

Pawan Kalyan's Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా కథ లీకైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసింది. ఇది రెండు వేర్వేరు కాలాల మధ్య సాగే కథ అని చెప్పేసింది. పవన్ కల్యాణ్‌తో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని.. ఇటీవలే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నానని తెలిపింది.

హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) కథను నిధి అగర్వాల్ లీక్ చేయడంతో సోషల్ మీడియాలో దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాలో పవన్ డ్యూయెల్ రోల్‌లో కనిపించవచ్చునని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తయింది. గతేడాది కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోగా.. ఆ తర్వాత పవన్ 'భీమ్లా నాయక్' షూటింగ్‌తో బిజీ అయిపోయారు.

ఈ ఏడాది జనవరి నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేయాలని భావించినప్పటికీ... ఇంతలోనే కోవిడ్ కేసులు పెరగడంతో మరోసారి బ్రేక్ పడక తప్పలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడక తప్పలేదు.

Also Read: IND vs SA: బౌండరీ ఇచ్చిన మయాంక్‌.. 5 పరుగులు సమర్పించుకున్న పుజారా! నిరాశలో కోహ్లీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News