Rashmika on Pushpa 2: మీకు వాగ్దానం చేస్తున్నా.. పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!!

హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా 'పుష్ప: ది రైజ్' ​​సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రెండో భాగంపై ఓ మాట ఇచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 02:05 PM IST
  • పుష్ప రాజ్ ఫైర్ తగ్గనే లేదు
  • పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
  • పుష్ప పార్ట్ 2కి రూ.3 కోట్ల రెమ్యునరేషన్
Rashmika on Pushpa 2: మీకు వాగ్దానం చేస్తున్నా.. పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!!

 Rashmika Mandanna promises Pushpa Part 2: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన సినిమా 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలై బంపర్ హిట్ అయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించారు. సినిమా విడుదలై దాపుగా నెల కావొస్తున్నా.. ఇప్పటికీ పుష్ప (Pushpa) రాజ్ ఫైర్ తగ్గనే లేదు. పుష్ప మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప రెండో భాగంపై ఉంది.

హీరోయిన్ రష్మిక తాజాగా 'పుష్ప: ది రైజ్' ​​సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రెండో భాగంపై ఓ మాట ఇచ్చారు. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్వెల్ మరింత బెటర్‌గా ఉంటుందని ప్రామిస్ (Rashmika Promises) చేశారు. సినిమా పట్ల అందరూ కురిపించిన ప్రేమ తమను మరింత కష్టపడేలా చేస్తుందని పేర్కొన్నారు. 'పుష్ప సినిమా పట్ల మీరు చూపిన ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము. పుష్ప 2 మరింత బిగ్గర్‌గా, బెటర్‌గా ఉంటుంది' అని రష్మిక ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేశారు.

Also Read: IND vs SA: బౌండరీ ఇచ్చిన మయాంక్‌.. 5 పరుగులు సమర్పించుకున్న పుజారా! నిరాశలో విరాట్ కోహ్లీ!!

పుష్ప సినిమా విజయవంతం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ కన్నడ భామ తన పారితోషికాన్ని పెంచినట్లు సమాచారం తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ కోసం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. పార్ట్ 2 కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ పెంచి.. మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు కూడా అంత మొత్తం ఇవ్వడానికి ఒకే అన్నారట. రష్మిక కెరీర్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ ఇదే. 

 
 
 
 
 

పుష్ప రెండవ భాగం (Pushpa Part 2) ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుందని డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 చివరి నాటికి థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఇక పుష్ప ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది. ఇక ప్రస్తుతం రష్మిక సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటున్నారు. తెలుగులో శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తోన్నారు. అలానే బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు హిట్ అయితే రష్మిక రేంజ్ మరింత పెరగడం ఖాయం. 

Also Read: Rat Magawa Dies: గతేడాదే రిటైర్మంట్‌ తీసుకున్న 'హీరో' మూషికం మృతి.. ఘనంగా అంత్యక్రియలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x