లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ( Life is beautiful ) హీరోగా పరిచయమైన సుధాకర్ కోమాకుల ( Sudhakar Komakula ) మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో సుధాకర్, తన భార్య హరికతో కలిసి 1984లో చిరు నటించిన 'ఛాలెంజ్' మూవీ ( Challenge movie ) నుంచి 'ఇందువదన కుందరదన' ( Induvadana Kundaradana song ) అనే హిట్ సాంగ్‌ను మళ్లీ అవే స్టెప్పులతో రీక్రియేట్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#Megastar Chiranjeevi responds on Actor #SudhakarKomakula attempt to give a Birthday special dance tribute along with...

Posted by Zee Hindustan Telugu on Friday, August 28, 2020

ఈ వైరల్ వీడియోను వీక్షించిన చిరు, సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ల ప్రేమకి, అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిరు ఆడియో మెసేజ్ పంపించారు. ముఖ్యంగా సుధాకర్ భార్య హరిక ఒక సాఫ్ట్‌వేర్ టెక్కీ అయ్యుండి సుధాకర్ కంటే కూడా చాలా బాగా డాన్స్ చేసింది అని చిరు ఆమెను మరింతగా పొగిడారు. ఈ వీడియో చూస్తుంటే తనకి తన చాలెంజ్ సినిమా షూటింగ్ రోజులు గుర్తొచ్చాయి అని చిరంజీవి ( Chiranjeevi ) అభిప్రాయపడ్డారు. అలాగే సుధాకర్ దంపతులు కూడా వాళ్ల జీవితంలో ఒకరినొకరు అర్దం చేసుకొని, ప్రేమతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా సరదాగా, హాయిగా సాగిపోవాలి అని దీవించారు. చిరు ప్రశంసలు యువ జంటను కచ్చితంగా సంతోషంలో ముంచెత్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్