Chiru Leaks: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించనున్న కొత్త చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ సినిమాలోని ఓ కీలక డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశారు. అది కూడా ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ముందు! 'ఆచార్య' ప్రమోషన్స్ లో పాల్గొన్ని చిరంజీవి.. తన సోదరుడు పవన్ కల్యాణ్ నటించనున్న కొత్త చిత్రంలోని డైలాగ్ ను బయటపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.. 'ఆచార్య' టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. 


ఈ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన చిరంజీవి.. డైరెక్టర్ హరీష్ శంకర్ అవకాశమిస్తే.. పవన్ కల్యాణ్ తో తెరకెక్కించబోయే 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రంలో తనతో పాటు రామ్ చరణ్ కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నామని చిరు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలోని ఓ డైలాగ్ ను చిరు లీక్ చేశారు. ఇప్పుడదే డైలాగ్ ను చిరు లీక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


'భవదీయుడు భగత్ సింగ్' మూవీ డైలాగ్ లీక్..



'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో విలన్ కు వ్యతిరేకంగా లక్ష మంది విద్యార్థులు పవన్ కల్యాణ్ రోడ్డెక్కుతారట. అది చూసిన విలన్.. "ఏంటయ్యా.. వీడి ధైర్యం.. లక్ష మంది విద్యార్థులు వాడి వెనుక ఉన్నారనా?" అంటాడట. అయితే అంతలోనే ఆయన పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతూ.. "లేదు. ఆయన ముందు ఉన్నాడని ఆ లక్ష మంది విద్యార్థుల ధైర్యం" అని చెప్తాడట. ఈ డైలాగ్ ను హరీష్ శంకర్ తనతో చెప్పారని చిరంజీవి అన్నారు. ఆ డైలాగ్ తనకెంతో నచ్చిందని చిరు తెలిపారు.  


Also Read: Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!


Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.