Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!

Avatar 2 Trailer: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'అవతార్ 2'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఓ బిగ్గెస్ట్ ఈవెంట్ సినిమాకాన్ లో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 12:47 PM IST
Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!

Avatar 2 Trailer: 'టైటానిక్', 'అవతార్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ మూవీస్ తో ప్రపంచాన్ని అలరించిన డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్.. త్వరలోనే 'అవతార్' సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'అవతార్' తొలి భాగం కంటే భిన్నంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. సముద్రగర్భాన జరగనున్న కథతో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది డిసెంబరు 16న 'అవతార్ 2' రిలీజ్ కానుందని జేమ్స్ కెమెరూన్ బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. 

అయితే ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని జేమ్స్ కామెరూన్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను ఓ బిగ్గెస్ట్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారని ఇటీవలే కొన్ని అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. అయితే అది నిజమేనని.. ప్రస్తుతం జరగుతున్న 'సినిమాకాన్ 2022' ఈవెంట్ లో ఏప్రిల్ 27న 'అవతార్ 2' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 

జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 2D, 3Dతో పాటు ఇప్పుడు 4D రూపంలోనూ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. 4K రిజల్యూషన్, IMAX, Dolby సౌండ్ ఎక్స్ పీరియన్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అవతార్ 2' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

Also Read: Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామాలు.. శత్రువులుగా బిందు మాధవి, యాంకర్ శివ!

Also Read: Shraddha Das Photos: మెస్మరైజింగ్ ఫొటోషూట్ తో అలరిస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News