Comedian Prudhvi Raj Health థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కామెడీ పండించిన పృథ్వీ ఇప్పుడు దర్శకుడిగా మారిపోయాడు. ఇన్నాళ్లు నవ్వించిన కమెడియన్ పృథ్వీ రాజ్ కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. అయితే ఈ సినిమాతో తన కూతురు శ్రీలుని హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు పృథ్వీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన హాస్పిటల్ బెడ్డు మీద కనిపించాడు. చేతికి సెలైన్ పెట్టుకుని నీరసంగా కనిపిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాను ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్న స్టంట్ అని అంతా అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు పృథ్వీ మీద కౌంటర్లు వేస్తున్నారు. నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది. దీంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఏ హాస్పిటల్‌లో చేరారు.. అసలేం జరిగిందనే విషయాలు తెలియకపోయినా, ఆయన హాస్పిటల్‌లో బెడ్‌పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియో మాత్రం వైరల్ అవుతోంది.


ఈనెల 26న ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నామని, తాను మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన ‘కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆడియెన్స్ ఆశీస్సులు ఉండాలని కోరాడు. ఇలా సెలైన్ ఎక్కించుకుంటున్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నానని, కాబట్టి మీ ఆశీస్సులు ఎప్పుడూ మా టీమ్‌కి, మా మూవీకి ఉండాలి.. థాంక్యూ అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్


మధ్యలో పృథ్వీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవ్వడం, టీటీడీలో పోస్ట్, ఆడియో కలకలం, చివరకు వైసీపీ నుంచి బహిష్కరణకు గురవ్వడం, ఆ తరువాత జనసైన తరుపున మాట్లాడటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టినట్టు కనిపిస్తోంది.


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook