Complaint lodged against hyper aadi: జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిథులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజానీకం పవిత్రంగా భావించి, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పూజించే గౌరమ్మ తల్లిని కించపరిచేలా జూన్ 13వ తేదీన ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ చేశారని, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని టీజేఎస్ఎఫ్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Anchor Anasuya latest pics: కవ్వించే ఫోజులతో యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్


తెలంగాణ యాస, భాషను కించపర్చేలా ద్వంద అర్థాలతో (Hyper Aadi double meaning dialogues) ఉన్నటువంటి ఆ స్కిట్ ప్రదర్శించిన హైపర్ ఆదితో పాటు ఆ స్కిట్ రాసిన రచయిత, కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుని వారు మరోసారి ఆ తప్పు చేయకుండా నిరోధించాల్సిందిగా తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


Also read : Radheshyam movie: ఈ నెలాఖరుకు రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి


ఇదిలావుంటే, హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై ఫిర్యాదులు అందడం ఇదేం మొదటిసారి కాదు అనే సంగతి తెలిసిందే. గతంలోనూ పలువురు హైపర్ ఆదిపై (Hyper Aadi) చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసులను (Hyderabad police) ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Also read : Chiranjeevi Donates Blood: సతీసమేతంగా రక్తదానం చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook