రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ (Bigg Boss Telugu 4)‌లో ఆరోవారంలో కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ (Kumar Sai Eliminated from Bigg Boss Telugu 4) అయ్యారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గత వారమే నువ్వు చాలా బాగా ఆడుతున్నావని హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు, ఇలాగే ఆడాలని సైతం కుమార్ సాయికి సలహాలు, సూచనలు ఇచ్చారు. బిగ్‌బాస్ 4 హౌస్‌ (Bigg Boss Telugu 4)లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారారు కుమార్ సాయి. గత మూడు వారాల్లో ఆయన ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కానీ ఆదివారం ఎపిసోడ్ చూసేసరికి కథ అడ్డం తిరిగింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని అంతే వైల్డ్ నిర్ణయంతో ఇంటినుంచి పంపేశారని బిగ్‌బాస్ 4 ప్రేక్షకులు భావిస్తున్నారు. నామినేషన్లలో ఎంతో మంది వీక్ కంటెస్టెంట్స్ ఉండగా.. రోజురోజుకు ప్రూవ్ చేసుకుంటూ ముందుకుసాగిన కుమార్ సాయి జర్నీ 6వ వారంలోనే ముగియడం ప్రేక్షకులకు రుచించడం లేదు. ఒక్కక్కరుగా సేవ్ అయిన తర్వాత చివరగా ముగ్గురు అరియానా గ్లోరి, కుమార్ సాయి, మొనాల్ గజ్జర్ మిగిలారు. వీరిలో అరియానా సేవ్ అని ప్రకటించారు. దీంతో ఎలిమినేట్ అయ్యేది నేనే అంటూ మొనాల్ ఏడ్వటం మొదలుపెట్టింది. 



 


ప్రేక్షకులు ఇచ్చిన ఓటింగ్, సోషల్ మీడియాలో టాక్ చూసినా మొనాల్ ప్యాకప్ చేప్పేసి ఇంటికి వెళ్తుందని భావించారు. కానీ, అనూహ్యంగా కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ కావడం వారికి నచ్చడం లేదు. తాము ఓట్లు వేసినా కుమార్ సాయిని బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేశారని, తమ నిర్ణయానికి.. ఓట్లకు ఏ విలువ లేదంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు మొనాల్ గజ్జర్ బిగ్‌బాస్ 4 హౌస్‌ను వదిలి వెళ్లారంటే షోకు క్రేజ్ తగ్గుతుందని, మరింత హైప్ తేవాలని ఆమెకు ఓట్లు రాకున్నా ఇంటి నుంచి ఎలిమినేట్ చేయలేదని  అర్థమవుతోంది. బిగ్‌బాస్ ప్రతి సీజన్‌లో కొందరికి జరిగినట్లుగా ఇప్పుడు కంటెస్టెంట్ కుమార్ సాయికి ఓట్లు వచ్చినా, బాగానే ఆడినా ఎలిమినేట్ చేశారని బిగ్‌బాస్ 4 ఆడియన్స్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.   



మూడో వారంలో దేవి, నాలుగో వారంలో స్వాతి ఎలిమినేషన్ విషయంలోనూ కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేవి టాప్ 5 లో ఉంటారనుకుంటే మూడో వారం ఎలిమినేట్ అయ్యారని, అప్పుడు ఇంటికి వచ్చిన స్వాతిని ఒక్క వారానికే ఎలిమినేట్ చేయడం సైతం బిగ్‌బాస్ ప్రేక్షకులు, నెటిజన్లు జీర్ణించుకోలేకపోయారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe