Bigg Boss Telugu 4 Nominations: 6వ వారం లిస్ట్‌లో 9 మంది.. చివరి నిమిషంలో అతడు సేఫ్ 

9 contestants get nominated for Sixth Week In Bigg Boss Telugu 4 | సోమవారం వచ్చిందంటే చాలు ఇల్లు హాట్ హాట్‌గా మారిపోతుంది. అందుకు కారణం బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ ఉంటాయి.

Last Updated : Oct 13, 2020, 12:41 PM IST
  • బిగ్‌బాస్ తెలుగు 4లో సోమవారం రాత్రి 6వ వారం నామినేషన్ ప్రక్రియ
  • కుమార్ సాయి, దివి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు
  • మిస్డ్ కాల్, హాట్‌స్టార్ ఓటింగ్ ద్వారా మీ ఫెవరెట్ కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు
Bigg Boss Telugu 4 Nominations: 6వ వారం లిస్ట్‌లో 9 మంది.. చివరి నిమిషంలో అతడు సేఫ్ 

రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4లో సోమవారం వచ్చిందంటే చాలు ఇల్లు హాట్ హాట్‌గా మారిపోతుంది. అందుకు కారణం బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ ఉంటాయి. బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్‌లో 6వ వారం ఇంటి నుంచి బయటకు పంపించేందుకు నిర్వహించిన ప్రక్రియలో మొత్తం 10 మంది నామినేట్ అయ్యారు. చివరికి ఆ సంఖ్య 9కి తగ్గింది.

 

 

నామినేట్ అయిన వారిలో మెహబూబ్ కూడా ఉన్నాడు. అయితే బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ సోహైల్‌కు బిగ్‌బాస్ ఓ పవర్ ఇచ్చాడు. దానిద్వారా అతడు ఓ కంటెస్టెంట్‌ను సేవల్ చేయవచ్చు. తనకు బిగ్‌బాస్ అవకాశం ఇవ్వగానే సోహైల్ మరోమాట ఆలోచించకుండా తన స్నేహితుడు మెహబూబ్‌ (Mehaboob Dil Se)ను సేవ్ చేస్తున్నట్లు చెప్పాడు. నామినేషన్ నుంచి మెహబూబ్ (Mehaboob Bigg Boss Telugu 4 Contestant) పేరు తప్పించగా.. ఇంటి నుంచి బయటకు పంపేందుకు 6వ వారం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.

 

తొలుత నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈవారం సైతం వాడివేడీగా వాదనలు జరిగి బిగ్‌బాస్ ఇంటి వాతావరణ మరోసారి వేడెక్కింది. మిర్చి దండలు మెడలో వేసి ఇద్దరు కంటెస్టెంట్స్‌ను మరో కంటెస్టెంట్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన కారణాలు చెప్పారు.

 

కంటెస్టెంట్ - ఎవరిని నామినేట్ చేశారంటే..
అరియానా - మెహబూబ్, మొనాల్ గజ్జర్‌ను నమినేట్ చేసింది
దివి - నోయల్, మెహబూబ్
నోయల్ - దివి, అభిజిత్
దేత్తడి హారిక - అరియానా, కుమార్ సాయి
అభిజిత్ - మెహబూబ్, అఖిల్
లాస్య - మెహబూబ్, దివి
మెహబూబ్ - దివి, అరియానా
సొహైల్ - అరియానా, కుమార్ సాయి
అమ్మ రాజశేఖర్ - లాస్య, అభిజిత్
అవినాష్ - దివి, అభిజిత్
మొనాల్ గజ్జర్ - అరియానా, దివి
అఖిల్ - అభిజిత్, అరియానా
కుమార్ సాయి - హారిక, సొహైల్ 

ఆరవ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే... (Bigg Boss Telugu 4: Nine contestants get nominated for Sixth Week)
నోయల్, దివి, అభిజిత్, అరియానా, కుమార్ సాయి, లాస్య, మొనాల్, హారిక, అఖిల్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x