KXIP vs MI Super Over: పాత రూల్ ఉంటే విజయం ఎవరిది? రెండో సూపర్ ఉండదు

Boundary Count Rule | IPL 2020లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అసలుసిసలైన టీ20 మజా వచ్చింది. ఈ సీన్ చూడగానే క్రికెట్ ప్రేమికులకు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం కాగా, ఆపై జరిగిన సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం అయ్యాయి. 

Last Updated : Oct 19, 2020, 11:27 AM IST
KXIP vs MI Super Over: పాత రూల్ ఉంటే విజయం ఎవరిది? రెండో సూపర్ ఉండదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అసలుసిసలైన టీ20 మజా వచ్చింది. ఎందుకో తెలియదు గానీ, ఈ ఏడాది కరోనా కారణంగా విదేశాలలో జరుగుతున్న ఈ సీజన్ ఐపీఎల్‌లో భారీగా సూపర్ ఓవర్‌లు జరిగాయి. అందులోనూ ఒకేరోజు రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు తొలిసారి అక్టోబర్ 18న జరిగాయి. అందులోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab), ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే ఓ రేంజ్ అనేలా ఉంది.

పంజాబ్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ తొలుత టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లోనూ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే ఈ సీన్ చూడగానే క్రికెట్ ప్రేమికులకు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు వస్తుంది. ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం కాగా, ఆపై జరిగిన సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం అయ్యాయి. సూపర్ టై గా ముగియడంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఐసీసీ పలు విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోంది. దీంతో కొత్త రూల్ అమలు చేసింది.

 

పాత రూల్ ఉంటే విజేత ఎవరంటే..
పాత రూల్ ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ నిర్వహిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్‌లో అధిక బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన చూస్తే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (24) సాధించిన ముంబై (15 ఫోర్లు, 9 సిక్సర్లు) విజేతగా నిలుస్తుంది. పంజాబ్ మొత్తం 22 (14 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీలు కొట్టింది.   

Also Read : SRH VS KKR: సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బంపర్ విజయం..

పంజాబ్‌కు కలిసొచ్చిన కొత్త రూల్
కొత్త రూల్ ప్రకారం... సూపర్ ఓవర్‌లో టై అయితే మరో సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. అలా ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సిందిగా గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇదే రూల్ సాయంతో కేఎల్ రాహుల్ సేన తమ మూడో విజయాన్ని రెండో సూపర్‌లో నెగ్గడం ద్వారా అందుకుంది.

 Also Read : Virender Sehwag: ఆ క్రికెటర్ కోవిడ్19 వ్యాక్సిన్ కనిపెట్టగలడు: సెహ్వాగ్ ట్వీట్ వైరల్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News