Debutants In IPL 2020: యంగ్ క్రికెటర్ల అరంగేట్రం అదిరింది

  • Oct 19, 2020, 13:27 PM IST

గతంలో రంజీల్లో రాణించి, అండర్19 జట్టులో సత్తా చాటి భారత జాతీయ జట్టులోకి వచ్చేవారు. ఇప్పుడు వీరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ కర్ట్ కట్‌లా మారింది. ఇక్కడ సంచలనాలు చేస్తే టీమిండియా నుంచి పిలుపు ఖాయమని భావిస్తారు. ఈ సీజన్ ద్వారా ఐపీఎల్‌కు పరిచయమైన కొందరు యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయి, తుషార్‌ దేశ్‌పాండేలు..  (Debutants In IPL 2020) అరంగేట్రంలోనే వెలుగులోకి వచ్చారు. ప్రతిభకు పదునుపెడితే జాతీయ జట్టులోకి రావడం ఏమాత్రం కష్టం కాదు.

1 /5

2 /5

టీమిండియా అండర్ 19 కెప్టెన్, యువ సంచలనం ప్రియం గార్గ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ మీద 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి నౌట్‌ట్‌గా నిలిచాడు. దాంతో 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై సన్‌రైజర్స్ విజయం సాధించింది. అయితే మిడిలార్డర్‌లో సరైన సహకారం అందకపోవడంతో త్వరగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సన్నింగ్ క్యాచ్‌లు అందుకుని ఫీల్డింగ్‌లోనూ ప్రయోజనకారి అని నిరూపించుకున్నాడు. (Pic courtesy: IPL)

3 /5

అండర్ 19 వరల్డ్ కప్‌లో 6 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు 19 ఏళ్ల యువ సంచలనం రవి బిష్ణోయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ప్రస్తుత సీజన్‌లో ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చాడు. 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టి పరవాలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన స్పెల్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.

4 /5

2008లో 13 ఏళ్ల బాలుడు అయిన తుషార్‌ దేశ్‌పాండే, ముంబై ఇండియన్స్ జట్టుకు బాల్ బాయ్‌గా చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. రెండు మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన ఈ అరంగేట్ర ఆటగాడు ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. (Pic courtesy: IPL)

5 /5

ఐపీఎల్ 2020లో లక్కీ ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్ ఒకడని చెప్పవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఆర్సీబీ 6 మ్యాచ్‌లు గెలవగా అందులో పడిక్కల్ తన వంతు పాత్ర పోషించిన మ్యాచ్‌లే అధికం. మరోవైపు జీవనదానాలు (Dropped catches) ఇతడికి వరంగా మారుతున్నాయి. అలవోకగా హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. 9 మ్యాచ్‌లలో 296 పరుగులు చేశాడు. మంచి బ్యాట్స్‌మన్‌గా రాటుదేలడానికి మరింత సమయం పడుతుంది. (Pic courtesy: IPL)