Custody Collections: దారుణంగా చైతూ `కస్టడీ` మూవీ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
Custody Movie one Week Collections: అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా తెరకెక్కి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా కలెక్షన్స్ దారుణంగా నమోదయ్యాయి.
Custody out from theatres in just one week: అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా తెరకెక్కి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. మానాడు లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఏ మాత్రం బాలేదని రివ్యూలు బయటకు రావడంతో పాటు మౌత్ టాక్ కూడా అలాగే ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ మీద భారీ ఎఫెక్ట్ పడింది. థాంక్యూ తర్వాత నాగచైతన్య కెరియర్లో ఈ సినిమా కూడా మరో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించని నేపథ్యంలో మొదటి వారంలోనే చాలా వరకు థియేటర్ల నుంచి ఈ సినిమా తొలగించినట్లు తెలుస్తోంది.
Also Read: Virupaksha OTT Release: ఓటీటీలోకి విరూపాక్ష.. ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?
మొదటి వారం అద్దెలు కూడా థియేటర్లకు రాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సీన్లు, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయని చాలామంది అంటున్నా ఎందుకో థియేటర్ల వరకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో వసూళ్లు కూడా దారుణంగా నమోదు అవుతున్నాయి. మొదటి వారం రోజులకు గాను కేవలం నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల షేర్ 8 కోట్ల 95 లక్షల గ్రాస్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలలో లభించింది.
ఇక ఏడవ రోజు మరీ దారుణంగా 20 లక్షల మాత్రమే వసూలు చేయడం గమనార్హం. ఇక వారం రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 29 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో కోటి 15 లక్షలు, తమిళంలో 34 లక్షలు కలిపి 6 కోట్ల 45 లక్షల షేర్, 14 ఓట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 24 కోట్లకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 25 కోట్లు నిర్ణయించారు. ఇంకా 18 కోట్ల 50 లక్షలు వసూలు చేస్తే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Bichagadu 2 Review: విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి