Darshan Jail Update : ప్రముఖ కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేయసి కోసం అభిమానిని హతమార్చిన వైనం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. సాధారణంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటే.. వారిని భయపెట్టో, బెదిరించో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆపుతారు. కానీ ఈయన మాత్రం ఏకంగా పరలోకాలకు పంపించి అందరిని ఆశ్చర్యపరిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Darshan Renuka Swamy Case
తనను ఎంతగానో ఆరాధించే ఒక అభిమానిని హత్య చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. భార్య కోసం కాదు ఎవరో పరాయి అమ్మాయి కోసం ఏకంగా హంతకుడిగా మారడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దర్శన్,  పవిత్ర గౌడతో పాటు ఈ హత్యలో భాగం పంచుకున్న మరో 15 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు పరప్పన జైల్లో ఉన్న దర్శన్ కు విఐపి ట్రీట్మెంట్ లభిస్తోందని ,అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రావడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ముఖ్యంగా రేణుకా స్వామి తండ్రి ఒక ఖైదీకి ఇలాంటి విఐపి సౌకర్యాలు కల్పించడం సమంజసంగా లేదు అని ఆయన వాపోయారు.  దీంతో ఆయనను బళ్లారి జైలుకు తరలించారు. గత కొద్ది రోజులుగా బళ్లారి జైల్లో ఉంటున్న దర్శన్ అర్ధరాత్రిళ్ళు వికృత చేష్టలు చేస్తున్నారని,  అక్కడి ఖైదీలు చెబుతున్నారు. ముఖ్యంగా రేణుకా స్వామి ఆత్మ తనను వెంటాడుతోందని , తనను చంపేస్తానని బెదిరిస్తోందని , దయచేసి పరప్పన జైలుకు తనను మార్చాలి అని జైలు అధికారులను దర్శన్ కోరుకుంటున్నట్లు సమాచారం.


అంతేకాదు అర్ధరాత్రి పూట కేకలు , అరుపులతో తోటి ఖైదీలను కూడా ఇబ్బంది పెడుతున్నట్లు తోటి ఖైదీలు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రేణుకా స్వామి ఆత్మ మాత్రం తనను వెంటాడుతోందని , అందుకే తనను జైలు మార్చాలని దర్శన్ వేడుకుంటున్నట్లు సమాచారం. 


ఇక ఈ విషయం తెలిసి ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.  ఈ కాలంలో ఆత్మలు ఏంటి అని కొంతమంది అంటే.. ఇంకొంతమంది చేసిన పాపం ఊరికే పోదు అంటూ కామెంట్ లు చేస్తున్నట్లు సమాచారం
ఏది ఏమైనా దర్శన్ కి ఎదురవుతున్న ఈ అనుభవాలను కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.


Also Read: Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి  నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?


Also Read: Tirumala Laddu Controversy : తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter