Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?

Haryana and jummu Kashmir exit polls: జమ్ముకశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయని తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా హోరా హోరీన ప్రచారం నిర్వహించాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 5, 2024, 09:21 PM IST
  • హర్యానాలో అధికారం దిశగా కాంగ్రెస్..
  • జమ్ములో వినూత్నంగా తీర్పిచ్చిన ప్రజలు
Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి  నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?

Jammu and Kashmir Haryana exit  polls 2024: దేశంలో మరోసారి ఎగ్జిట్ పోల్స్ ల హీట్ కొనసాగుతుంది. జమ్ము కశ్మీర్ , హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్ములో మూడు విడతల్లో, హర్యానాలో ఒకే దశలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలలో కూడా 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు సైతం తమ అస్త్ర శస్త్రాలను ఉపయోగించాయని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో ఈనెల 8న ఎన్నికల లెక్కింపు జరగనుంది.

హర్యానా..

హర్యానాలో 90 అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఒకే దశలో ఇక్కడ పోలీంగ్ జరిగింది.ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగిలినట్లు కూడా పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచానాలు వెలువరించాయి.ఇప్పటి వరకు హ్యాట్రిక్ విజయాలు సాధించిన బీజేపీకి ఈసారి మాత్రం ప్రజల నుంచి అనుకొని విధంగా షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా రైతు వ్యతిరేక చట్టాలు, హర్యానాలోని రైతులు ఎక్కువగా నిరసనలు తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి కూత వేటు దూరంలో ఉండే హర్యానాలో ఈసారి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం పట్ల కూడా ప్రజలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కిసాన్, నౌ జవాన్, బల్వాన్ అంటే.. రైతులు, యువకులు, జాట్ తెగకు చెందిన వారు.. కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు పలు సంస్థలు తెలిపాయి.

పీపుల్స్ పల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 55 స్థానాల్లలో విజయం సాధించే అవకాశం కన్పిస్తుంది.బీజేపీ 28, ఐఎన్ఎల్డీ 2 నుంచి 6, జేజేపీ 2 స్థానాలకు పరిమితం అవ్వనున్నట్లు తెలుస్తోంది.

దైనిక్ భాస్కర్ ప్రకారం.. కాంగ్రెస్ 44 నుంచి 54, బీజేపీ 22 నుంచి 29, ఐఎన్ఎల్ డీ 1 నుంచి 6 స్థానాలను గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి.
 పి మార్క్ ప్రకారం.. కాంగ్రెస్ లు.. 55 , బీజేపీ 16 నుంచి 30 స్థానాలకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.

జమ్ము కశ్మీర్..

జమ్ము కశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. అంతేకాకుండా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మోదీ సర్కారు ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ మొదలైన అంశాలు ఇక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలు వచ్చేలా చేశాయని తెలుస్తోంది.అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్ కూటమికి ఇక్కడ భారీగా సీట్లు వస్తాయని ఎగ్జీట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

మరోవైపు జమ్ములో ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46. మరోవైపు 2014 లో ఏ పార్టీకి కూడా అనుకున్న మెజార్టీ రాకపోవడంతో.. బీజేపీ,పీడీపీ లు కలిసి సర్కారు ఏర్పాటు చేశాయి. అయితే.. ఇప్పుడు మాత్రం రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలోకి దిగాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీ పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగాయి.

జమ్ములో.. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 46 నుంచి 52 స్థానాలను గెల్చుకొవచ్చనిన పీపుల్స్ సంస్థ అంచనా వేస్తోంది. అదే విధంగా.. బీజేపీ 24 నుంచి 32 స్థానాలు గెలుస్తుందని సమాచారం. పీడీపీ13 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 34 నుంచి 39 స్థానాలు గెల్చుకొవచ్చని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.

దైనిక్ భాస్కర్ ప్రకారం.. పీడీపీ 4 నుంచి 7, బీజేపీ 23 నుంచి 28, కాంగ్రెస్ ఎన్ సీ కూటమి 42, ఇతరులు 10 వరకు గెల్చుకొవచ్చని సమాచారం
 నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి... 48సీట్లు, ఇండియాటుడే సీ ఓటర్ సర్వే.. బీజేపీకి 34, పీడీపీకి 13, ఇతరులకు 12 సీట్లు గెలుస్తాయని అంచా వేసింది.

Read more: 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..

మొత్తానికి బీజేపీకి జమ్ములో కూడా అంతగా కలిసి రాకపోవచ్చని కూడా పలు సర్వేసంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల చేశాయి.  మరోవైపు ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాల కోసం మాత్రం.. అక్టోబరు 8 వరకు వేచి ఉండాల్సిందే.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x