Dasara Becomes First Telugu Film with Highest-ever censor cuts: నాని కెరీర్ లో మొట్టమొదటిసారిగా రా అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్న చిత్రం దసరా. నాని కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా ఈ సినిమాను రూపొందించారు. తెలంగాణలో సింగరేణి గనుల నేపథ్యంలో గోదావరిఖని బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా రూపొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా పూర్తిస్థాయిలో మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉండబోతుందనే విషయం ముందు నుంచి మేకర్స్ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అదే విధంగా సినిమా నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్ వంటివి కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కాస్త నేటివిటీకి, రియాలిటీకి దగ్గరగా ఉండటంతో బూతులు కూడా కాస్త ఎక్కువగానే ముందు నుంచి వినిపిస్తూ వచ్చాయి. అయితే తెలంగాణలో సాధారణంగా మాట్లాడే పదాలే తాము సినిమాలో కూడా వాడామని చెబుతూ దర్శక నిర్మాతలు, హీరో నాని కవర్ చేసుకుంటూ వచ్చారు.


కానీ ఇప్పుడు ఈ సినిమాకు తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 36 కట్లు సెన్సార్ సభ్యులు చెప్పారని తెలుస్తోంది. దాదాపు 10కి పైగా పదాలను మ్యూట్ చేయాలని, కొన్నింటిని పూర్తిగా తొలగించాలని, కొన్నింటిని సూచించినట్లు తెలుస్తోంది. ఇక మా దగ్గర ఉన్న సమాచారం మేరకు బాంచత్ , బద్దలు బాసింగాలు అయితయ్, బాడకౌ, బోసిడి దాన, పీరల్ చూసి పీతల్ని, ము*, లం* కొడకా, మూలాధారం కింద గు*లు, లుంగీ కూడా లే*దు, చు*యా వంటి పదాలను మ్యూట్ చేయాలని, తొలగించాలని కొన్నింటికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే టైటిల్స్ పడేటప్పుడు పొగ తాగుతున్నట్టు ఉన్న చోట పొగ తాగడం హానికరం అనే పదాలు పెట్టాలని అలాగే మందు, సిగరెట్ తాగుతున్నప్పుడు దానికి సంబంధించిన పదాలు కూడా పెద్దగా కనిపించేలా పెట్టాలని సూచించారు.


అలాగే మందు తాగడం హానికరం అని ముందు నుంచి కూడా సినిమా మొత్తం ప్రమోట్ చేయాలని ఎక్కడ సీన్ వచ్చినా అక్కడ చూపించాలని పేర్కొన్నారు. అలాగే సూరి డెడ్ బాడీ నుంచి తల వేరవుతున్న సమయంలో బ్లర్ చేయాలని సూచించారు. హీరో నాని ఒక వ్యక్తి శరీరంలో గొడ్డలి దింపి లాగి మళ్లీ లోపలికి దింపుతున్న విజువల్స్ తగ్గించాలని సూచించడమే కాదు సిల్క్ స్మిత ఉన్నచోట బ్లర్ చేయాలని కూడా సూచనలు చేశారు. అయితే వీటిలో కొన్ని తెలంగాణలో సాధారణంగా వాడే పదాలు ఉన్నా వాటిని సెన్సార్ బోర్డు తొలగించాలని లేదా మ్యూట్ చేయాలని సగం మ్యూట్ చేయాలని పేర్కొనడం హాట్ టాపిక్ అవుతుంది.
Also Read: Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?


Also Read: Karan Johar on Deverakonda: విజయ్ దేవరకొండతో కరణ్ అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి సంచలన ట్వీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook