Consecutive Deaths in Tollywood Industry: మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీని (Tollywood INdustry) కుదిపేసిన కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సినీ ఇండస్ట్రీకి జరుగుతున్న వరుస విషాదాలకు సినీ పెద్దలు, అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు. గడచిన వారంలోనే శివ శంకర్‌ మాస్టర్‌ (Shiva Shankar Master Death), సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Death), ఈ రోజు టాలీవుడ్ యాంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు (Abbavaram Kiran Brther Death)రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణిచించారు.. వార్త తెలుగుసుకున్న సినీ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా బారిన పడ్డ శివ శంకర్‌ మాస్టర్‌ (72) హైదరాబాద్‌ ఏఐజీలో (AIG hospital) చికిత్స పొందుతూ మొన్న మరణించారు. కరోనా సోకటం (Corona) వలన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో చికిత్స పొందుతూ శివ శంకర్‌ మాస్టర్‌ మరణించారు.. ఇక ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ (Vijay Shankar) కరోనాతో పోరాడుతున్నారు. ప్రముఖులు శివశంకర్ మాస్టర్ కుటుంబానికి సంతాంపం తెలిపిన సంగతి తెలిసిందే.. 


Also Read: Scary Snake Video: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. చిన్న పాము పెద్ద గుడ్డు స్వాహా..!!


అయితే, నిన్న తెలుగు లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) గారి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది. క్యాన్సర్‌ తో (Cancer) ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు సగం ఊపిరితిత్తిని తొలగించిన విషయం... గతంలో బైపాస్‌ సర్జరీ జరగటం.. కూడా మన అందరికి తెలిసిందే.. అయితే వారం క్రితం మరో లంగ్‌కు కూడా క్యాన్సర్‌ వచ్చిందని దీంతో సిరివెన్నెల తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులుపడడంతో చికిత్స కోసం కిమ్స్‌లో (KIMS) చేర్పించారు. అయితే తాజాగా కూడా మరో వైపు ఉండే ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ రావడం...  దాంట్లో కూడా సగం తీసేసారు. రెండు రోజులు ఆయన బాగానే ఉన్నారని ఆక్సినేషన్‌ సరఫరా సరిగా లేకపోవడంతో ఐదు రోజులుగా సిరివెన్నెల ఎక్మో మెషీన్‌పైనే ఉంచాల్సి వచ్చిందన్నారు. ఇక ఆయన కిడ్నీ కూడా దెబ్బతినడం వల్ల శరీరమంతా ఇన్ఫెక్షన్‌ సోకిందని.... దాంతో పరిస్థితి విషమించి సిరివెన్నెల మరణించారని కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. 


Also Read: Hair Dry With Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ తో హెయిర్ డ్రై.. సోషల్ మీడియాలో వీడియో వైరల్


ఈ రోజు కడప జిల్లా (Kadapa) చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యంగ్ టాలీవుడ్ హీరో అబ్బవరం కిరణ్ (Hero Abbavarm Kiran) సోదరుడు రామాంజులు (Ramanjulu Death) కన్నుమూశారు. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు సంబేపల్లె (Sambepalley) మండలంలోని  దుద్యాల (Dudyala) గ్రామంలో నివాసముంటున్నాడు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన అబ్బవరం రామాంజులు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు హీరో కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook