Marvel Cinematic Universe: మార్వెల్ యూనివర్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ సినిమాటికి యూనివర్స్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు అంచనాలు భారీగా ఏర్పరుతాయి. కాగా ప్రస్తుతం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ఈ సినిమాకి షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా మేక‌ర్స్ టీజ‌ర్ విడుదల చేశారు.


 




ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్లు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. కాగా ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మోరెనా బక్కరిన్, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


డెడ్‌పూల్ అదే పేరుతో మార్వెల్ కామిక్స్ పాత్ర ఆధారంగా 2016లో విడుదలైన అమెరికన్ సూపర్ హీరో చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఈ చిత్రం వస్తుంది.


జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమా కూడా ముందు భాగాలలో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటున్నాను మార్వెల్ సినిమాకి యూనివర్స్ అభిమానులు తెగ ఆసక్తిగా ఉన్నారు.


Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌


Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook