Nayanthara Remuneration viral: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌(Shah rukh Khan) లేటెస్ట్ మూవీ 'జవాన్'. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ మూవీలో న‌య‌న‌తార(Nayanthara) హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) విల‌న్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకోణె (Deepika Padukone) గెస్ట్ రోల్ చేయబోతుంది. ప‌ఠాన్ సక్సెస్ తర్వాత షారుఖ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా అట్లీ, హీరోయిన్‌గా న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో  రూపొందుతున్న ఈ సినిమాకు సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నాలుగు వంద‌ల కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన న‌య‌న‌తార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికా ప‌డుకోణెకే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కినట్లు సమాచారం. ఈ మూవీకిగానూ న‌య‌న‌తార 11 కోట్లు పారితోషికం తీసుకోగా.. దీపికా 17 నుంచి 20 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతినాయకుడిగా నటించిన విజ‌య్ సేతుప‌తి 21 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


Also Read: Vishwak Sen: ఇంట్రెస్టింగ్ గా విశ్వక్‌సేన్‌ కొత్త చిత్రం టైటిల్.. గూప్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook