Deepika Padukone: వారందరికీ సమస్యగా మారిన దీపికా పడుకోణే ప్రెగ్నెన్సీ.. కారణం ఏంటంటే!
Deepika Padukone Pregnancy: బాలీవుడ్ దివా దీపికా పడుకోణే త్వరలో తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అఫీషియల్ గా ఈ వార్తను దీపిక, రణవీర్ సింగ్ అనౌన్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోని కొంతమందికి ఇది సమస్యగా మారింది అని వినికిడి.
Deepika Padukone Upcoming Movies: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే.. 2018లో దీపిక తాను ప్రేమించిన రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. కాగా ఇప్పుడు పెళ్లయిన ఆరు సంవత్సరాలకి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఈ మధ్యనే ఈ జంట ధ్రువీకరించింది. తల్లిదండ్రులు కాబోతున్నాము అని వీరు ప్రకటించిన వెంటనే ఆ వార్త వైల్డ్ ఫైర్ లా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది.
ఈ నేపథ్యంలో దీపికా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా సెట్స్ పై ఉన్న సినిమాల సంగతేమిటి అని ఆరాలు మొదలుపెట్టేశారు నెటిజన్స్. ప్రస్తుతం ప్రభాస్, నాగ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి చిత్రంలో కూడా దీపిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు లో ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తి అయ్యిందా.. లేదా? అంటూ డార్లింగ్ అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు. ఎక్కడ దీపిక వల్ల ఈ మూవీ లేట్ అవుతుందో అనేది వారి బాధ. అయితే ఇంకా ఈ విషయం గురించి కల్కి చిత్ర బృందం నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకునే ఉద్దేశంలో ఉన్న దీపిక కరణ్ జోహార్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం కరణ్ ఎప్పటినుంచో దీపిక డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. కరణ్ దీపికతో ఈ మూవీ గురించి డిస్కస్ చేసినప్పుడు స్టోరీ బాగా నచ్చి ఓకే చెప్పింది. అయితే ప్రస్తుతం తాను ఉన్న స్థితిలో మూవీ చేయలేదు కాబట్టి తనకోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని దీపిక..కరణ్‌తో చెప్పిందట. అయితే కరణ్ మాత్రం దీపిక మాతృత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆమె కోరుకున్నంత కాలం వెయిట్ చేయడానికి రెడీ అని చెప్పారట.
ప్రస్తుతం తన చేతిలో ఇంకా చిత్రాలు ఉన్నాయని.. కాబట్టి దీపిక ఈ ప్రాజెక్టు గురించి బాధపడాల్సిన అవసరం లేదని కరణ్ అన్నారట. పైగా ఇలా హీరోయిన్ ప్రెగ్నెన్సీ లీవ్స్ కోసం సినిమాను ఆపడం కరణ్ కు కొత్తేమీ కాదు. అలియా భట్ విషయంలో ఒక పాట కోసం కరణ్ సుమారు సంవత్సరం పాటు వెయిట్ చేశారు.'రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ'మూవీ టైం లో ప్రెగ్నెంట్ అయిన ఆలియా పై కాశ్మీర్లో చిత్రీకరించాల్సిన ఒక పాట కోసం అతను దాదాపు డెలివరీ అయ్యే వరకు ఆగాడు. హిందీ సినిమాలతో పాటుగా దీపిక చేయబోతున్న హాలీవుడ్ చిత్రాలపై కూడా ఆమె ప్రెగ్నెన్సీ ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడి నిర్మాతలు మాత్రం దీపికా ప్రెగ్నెన్సీ వల్ల
…డేట్స్ ఆలస్యం అవ్వడమో లేదో మరో హీరోయిన్ వెతుక్కునే సమస్య రావచ్చని ఆలోచిస్తున్నారట.
కానీ అమెరికన్ సిరీస్ 'ది వైట్ లోటస్' నిర్మాతలు.. సీజన్ 3 కోసం దీపిక డెలివరీ అయ్యే వరకు ఆగే అవకాశం కూడా ఉంది అని టాక్. మొత్తం పైన దీపిక ప్రెగ్నెన్సీ ని గౌరవించి వీరందరూ తనకు కావాల్సినంత రెస్ట్ ఇచ్చి ఈ సినిమాలు కొనసాగిస్తారా లేకపోతే వేరే హీరోయిన్స్ ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: సీఎంగా ఎన్నికై 100 రోజులు కూడా కాలే.. అప్పుడే రేవంత్ రెడ్డికి గుడి
Also Read: బీఆర్ఎస్, బీఎస్పీల మధ్య కుదిరిన పొత్తు.. తెలంగాణ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter