Deepika Uses Gents Toilet: మగాళ్ల టాయిలెట్ కి వెళ్లిన దీపికా పదుకొణె, ఆలియా భట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Deepika Uses Gents Toilet: బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ఆలియా భట్.. చాలా సన్నిహితంగా ఉంటారు. అటు సినిమాల పరంగానే కాకుండా.. తరచూ వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. అయితే ఒకసారి వేరే దేశం వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి పురుషుల టాయిలెట్ కు వెళ్లారట. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె రివీల్ చేసింది.
Deepika Uses Gents Toilet: బాలీవుడ్ నటీనటులు దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గెహ్రైయాన్'. రొమాంటిక్ నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో దీపిక, అనన్య, సిద్ధాంత్ పాల్గొన్నారు. అందులో పాల్గొన్న యాంకర్ దీపికా పదుకొణెకు ఓ సూటి ప్రశ్న వేశారు.
"మీరు ఎప్పుడైన పురుషుల టాయిలెట్ కు వెళ్లారా" అని ప్రమోషన్స్ లో పాల్గొన్న యాంకర్ ప్రశ్నించగా.. అందుకు దీపికా పదుకొణె సరదాగా సమాధానమిచ్చింది. "చూడటానికి పరిశుభ్రంగా ఉంటే కచ్చితంగా వెళ్తా"నంటూ దీపిక చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ ను దీపిక ఈ కార్యక్రమంలో బయటపెట్టింది.
"ఊహించిని పరిస్థితుల్లో మెన్స్ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వెళ్తా. ఎందుకంటే అలాంటి సంఘటన ఒకటి నా లైఫ్ లో ఒకసారి జరిగింది. నా జీవితంలో ఒకరోజు పురుషుల టాయిలెట్ వాడాల్సి వచ్చింది. బెర్లిన్ లో జరిగిన ఓ మ్యూజికల్ కోల్డ్ ప్లే కన్సర్ట్ కు ఆలియా భట్ తో పాటు కలిసి వెళ్లాను. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అత్యవసరంగా టాయిలెట్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అదే సమయంలో మహిళల వాష్ రూమ్ బయట పెద్ద క్యూ ఉంది. ఆ సమయంలో గతి లేక పురుషుల టాయిలెట్ కు నేను, ఆలియా వెళ్లాం" అని దీపికా పదుకొణె పేర్కొంది. అయితే బాలీవుడ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఆలియా భట్ అని చెప్పింది దీపిక. తాను, ఆలియా 'పార్టర్న్స్ ఇన్ క్రైమ్' అని సరదాగా చెప్పుకొచ్చింది.
Also Read: Malavika Mohanan Bikini: మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహనన్ బికినీలో ఎలా ఉందో చూడండి!
Also Read: Ketika Sharma Pics: ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతిపోగోడుతోన్న కేతిక శర్మ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook