Devil TV Premiere: ప్రముఖ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా కళ్యాణ్ రామ్ `డెవిల్` మూవీ..
Kalyan Ram - Devil TV Premier: టాలీవుడ్లో ఎపుడు ప్రయోగాలు చేయడంలో ముందుండే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. స్టోరీ నచ్చితే తన ఇమేజ్‌కు సరిపోతుందా లేదా అనే తేడా లేకుండా సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో కళ్యాణ్ రామ్. గతేడాది `డెవిల్` మూవీతో పలకరించారు. ఈ సినిమా టాక్ బాగున్న అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Kalyan Ram - Devil TV Premier: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది 'అమిగోస్', డెవిల్ మూవీలతో పలకరించారు. ఈ రెండు ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక అమిగోస్ మూవీలో కళ్యాణ్ రామ్ తొలిసారి మూడు పాత్రల్లో కనిపించి ఔరా అనిపించాడు. ఇక 2023 యేడాది చివర్లో 'డెవిల్' మూవీతో పలకరించాడు. ఈ మూవీ టాక్ బాగున్నా..సలార్ సక్సెస్ వేడిలో కొట్టుకుపోయింది. ఆ సినిమా చూసిన హ్యాంగోవర్‌లో ఉన్న ప్రేక్షకులు డెవిల్ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా టాక్ బాగున్నా.. థియేట్రికల్‌గా పెద్దగా పర్ఫామ్ చేయలేదు.
ఇక బింబిసార తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత అదే జోరును కంటిన్యూగా చేయలేకపోయారు. ఇక కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీ 'డెవిల్' మూవీ విషయానికొస్తే..ఇదో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూరా ఈ కథను అల్లారు. అప్పటి కాలానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కోసం చిత్ర యూనిట్ బాగానే కష్టపడింది. ఓవరాల్‌గా కాన్సెప్ట్ బాగున్నా.. రాంగ్ రిలీజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్ల విషయానికొస్తే..
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికొస్తే..
రూ. 8.46 కోట్ల షేర్ (రూ. 16.45 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.13 కోట్ల షేర్ (రూ. 20.70 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి కేవలం రూ. 10.13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 10.87 కోట్ల నష్టాలతో డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నెంబర్ ట్రెండింగ్‌లో కొనసాగింది. మరోవైపు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అంతా సిద్దమైంది. ఈ మూవీ మార్చి 10 ఈటీవీలో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. మొత్తంగా థియేటర్స్, ఓటీటీలో మిస్ అయిన ప్రేక్షకులు మార్చి 10న ఈ సినిమా చూడొచ్చన్న మాట.
Also read: CM Revanth Reddy: అసెంబ్లీలో సబితకు చుక్కలు.. అక్కా.. అంటూనే కడిగేసిన సీఎం రేవంత్ రెడ్డి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook