CM Revanthr Reddy VS Sabitha Indrareddy: తమ్ముళ్లు తప్పులు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత ఒక అక్కగా.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరడుగుల వ్యక్తి హరీష్ రావు అసెంబ్లీలో అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న సబితక్క.. ఒక్కమాట కూడా మాట్లాడట్లేరని రేవంత్ మండిపడ్డారు. తాండూరు, వికారాబాద్, చెవెళ్ల, ప్రాంతాలలో వ్యవసాయం పండటానికి సబిత ఎన్నో ధర్నాలు చేశారన్నారు.
Read More: Belly fat: బెల్లిఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్ డైలీ పాటిస్తే వారంలో చెక్ పెట్టేయోచ్చు..
ఆనాడు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పలుమార్లు దీనిపై కలిశారని రేవంత్ గుర్తు చేశారు. అయితే.. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కూడా ఇక్కడ ప్రాజెక్టు కోసం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి, శిలాఫలకం వేయించారన్నారు. దీని కోసం ఇప్పటికే వందల, వేల కోట్లు ఖర్చు కూడా చేశారన్నారు. కానీ.. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి .. మంత్రిగా ఉన్నా కూడా సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తిచేయలేదన్నారు.
దీని వల్ల పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్, చెవెళ్ల, కొడంగల్ ల్ లో తీవ్రమైన పంటనష్టం వాటిల్లిందని అన్నారు. ఇది పూర్తిగా సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోకపోవడం వల్లనే జరిగిందని రేవంత్ మండిపడ్డారు. దీనిపై సబితా కౌంటర్ ఇస్తూ.. తాను తొలిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఏవిధంగానైతే.. తొందరగా పూర్తి చేశారో, చెవేళ్ల ప్రాజెక్టుకూడా తొందరగా పూర్తిచేయాలని ఆనాటి సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో కోరినట్లు సబితా రిప్లై ఇచ్చారు.
ఈ క్రమంలో.. మరీ ఇన్నాళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ప్రాజెక్టు పూర్తికాలేదని రేవంత్ అన్నారు. హరీష్ రావు, మిగతా నేతలు ప్రాజెక్టులపై అబద్దాలు ఆడుతున్న కూడా అక్కగా.. సబితా ఒక్కమాట కూడా మాట్లాడట్లేదన్నారు. తమ్ముళ్లు తప్పుచేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత అక్కమీద ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. కాగ్ నివేదికను, విజిలెన్స్ నివేదికలను కూడా తప్పులంటున్నారు.
Read More: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్
మీరు నియమించిన అధికారులు.. నివేదికను కూడా అవాస్తవాలు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు మరీ దిగజారీ మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. సిట్టింగ్ జడ్జీ లేదా రిటైర్డ్ జడ్జీలతో దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు.. చేసిన తప్పులు అంగీకరించి, తెలంగాణ డెవలప్ మెంట్ దిశగా సాగుదామన్నారు. కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ లోకి పోయి.. వారు చెప్పిన సిలబస్ విని అలానే మాట్లాడుతున్నారని, కానీ ఆయనకు చాలా విషయాలపై మంచి అనుభవం ఉందని సీఎం రేవంత్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
CM Revanth Reddy: అసెంబ్లీలో సబితకు చుక్కలు.. అక్కా.. అంటూనే కడిగేసిన సీఎం రేవంత్ రెడ్డి...
- తమ్ముళ్లు తప్పులు చేస్తే సబితమ్మ మాట్లాడట్లేరు..
- అసెంబ్లీలో ఫైర్ అయిన సీఎం రేవంత్..