Dhanush Aishwaryaa Separation Rajinikanth words : హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య వారి వైవాహిక జీవితానికి వీడ్కోలు చెప్పుకున్న విషయం తెలిసిందే. ఈ జంట విడిపోవడంతో ఇప్పుడు అంతటా ఇదే చర్చ సాగుతోంది. ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లుగా జనవరి 17న రాత్రి సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజనీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్‌ల వివాహం 2004లో జరిగింది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే ప్రస్తుతం ఐశ్వర్య, (Aishwaryaa) హీరో ధనుష్‌లు విడిపోవడంతో ఒక పాత వీడియో సోషల్‌ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.



గతంలో రజనీకాంత్... ధనుష్‌ను (Dhanush) ప్రశంసించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాలా మూవీ మ్యూజిక్ లాంచ్‌ సమయంలో రజనీకాంత్ ధనుష్‌ను ప్రశంసించారు. ధనుష్ మంచి తండ్రి, మంచి భర్త అంటూ రజనీకాంత్ (Rajinikanth) అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Fuel Price Hike: వాహనదారులకు షాక్​.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!


ధనుష్ అద్భుతమైన కుర్రాడు.. తన తల్లిదండ్రులను ఎంతో గౌరవిస్తాడు, వారిని దేవుడిలా భావిస్తాడు అంటూ రజనీకాంత్ ఆ వీడియోలో చెప్పాడు. ధనుష్‌ తన భార్య ఐశ్వర్యను ఎంతో బాగా చూసుకుంటాడని రజనీకాంత్ అన్నారు. అలాగే ధనుష్.. (Dhanush) మంచి తండ్రి.. మంచి అల్లుడు.. మంచి మనిషి... అలాగే మంచి ప్రతిభ గలిగిన వ్యక్తి అంటూ రజనీకాంత్ చెప్పాడు.


Also Read : AP Corona cases: ఏపీలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook