Dhanush Aishwaryaa Divorce : ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగారు..

Lakshmy Ramakrishnan tweet on Dhanush Aishwaryaa Divorce : ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగింది నటి, డైరెక్టర్ ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. హీరోయిన్ స‌మంత‌ విషయాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చింది ల‌క్ష్మీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 05:39 PM IST
  • ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యలు విడాకులు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ఫ్యాన్స్
  • విడాకులు వెన‌క్కి తీసుకోవాలని కోరుతున్న అభిమానులు
  • ఒక ఫ్యాన్‌ ట్వీట్‌పై స్పందించిన ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్
Dhanush Aishwaryaa Divorce : ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల విడాకుల విషయంలోకి సమంతను లాగారు..

Dhanush Aishwaryaa Divorce : ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడిపోవడంతో చాలా మంది ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవ‌డంతో అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. విడాకులు వెన‌క్కి తీసుకోవాలంటే ఫ్యాన్స్ కోరుతున్నారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు ఇటీవల వీడ్కోలు పలికారు. అయితే మీ రిలేష‌న్‌ను ఇలా అర్ధాంతరంగా ముక్క‌లు చేసుకోవ‌ద్ద‌ంటూ అభిమానులు ధ‌నుష్‌, (Dhanush) ఐశ్వ‌ర్యలను వేడుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య (Aishwaryaa) విడిపోతున్నామంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌తో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైర‌ల్‌ అవుతోంది. అమ్మా.. ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ మీరే వారిద్దరినీ ఎలాగైనా క‌ల‌పాలి అంటూ ఆ అభిమాని కోరాడు.

ఇక దీనిపై న‌టి, డైరెక్టర్ ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ (Lakshmy Ramakrishnan) స్పందించారు. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యలు ప‌ర‌స్ప‌ర గౌర‌వ‌భావంతోనే విడిపోతున్నార‌ంటూ పేర్కొంది ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్. వారిద్దరూ బ‌హిరంగంగా ఒక‌రిపై ఒక‌రు నోరు పారేసుకుంటూ లేదా లీగల్‌గా డైవర్స్‌ రావ‌డానికి ముందే వేరొక‌రితో రొమాన్స్ చేస్తూ ఒక‌రినొక‌రు మాన‌సికంగా కించ‌ప‌ర‌చుకోవడం లేదని ఆమె తెలిపారు.

ద‌య‌జేసి వారిని ఒంట‌రిగా వ‌దిలేయాలంటూ ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ కోరారు. ఇక దీనికి ఆ అభిమాని రిప్లై ఇచ్చాడు.. "వారి నిర్ణ‌యాన్ని తాను గౌర‌విస్తున్నానని, కానీ వారు సైలెంట్‌గా విడిపోయింటే బాగుండేది.. ఇలా ప్ర‌చారం చేయ‌డ‌మే అస్స‌లు బాగోలేదంటూ" ఆ ఫ్యాన్ ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ పోస్ట్‌పై రిప్లై ఇచ్చాడు.

ఇక దీనిపై ల‌క్ష్మీ మ‌రోసారి బ‌దులిచ్చారు. హీరోయిన్ స‌మంత‌ విషయాన్ని ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటూ ఒక పోస్ట్ చేసింది. ఒక‌వేళ ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడిపోతున్న విష‌యాన్ని ఇలా బహిరంగంగా వెల్లడించకపోతే.. వారిపైన చాలా రూమర్స్, వార్త‌లు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చింది ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల గురించి చాలా ఎక్కువ త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుందని చెప్పింది.

Also Read : Amazon Republic Day Sale 2022: అమెజాన్​ రిపబ్లిక్​డే సేల్​ లాస్ట్​ డే ఆఫర్లు ఇవే..!

స‌మంత‌, (Samantha) నాగ‌ చైత‌న్య విడిపోతున్న‌ట్లు అఫీషియల్‌గా ప్ర‌క‌టించినా సమంత చాలా దారుణ‌మైన విష‌యాల్ని భ‌రించాల్సి వ‌చ్చిందంటూ పేర్కొంది ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్. అయితే ఇప్పుడు ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ ట్వీట్ (Tweet) వైరల్‌గా మారింది. ఈ విషయంలోకి స‌మంత‌ను ఎందుకు లాగుతారంటూ నెటిజెన్స్‌ పోస్ట్స్ చేస్తున్నారు.

Also Read : Lahore Blast: పాకిస్తాన్ లాహోర్‌లో బాంబు పేలుడు, ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News