Dil Raju: సంధ్య థియేటర్ బాధిత రేవతి భర్తకు దిల్ రాజు బంపర్ ఆఫర్.. సినిమా ఛాన్స్
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Sandhya Theatre Stampede: తొక్కిసలాట సంఘటన చుట్టూ సినీ పరిశ్రమ.. తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్న వేళ సినిమా అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రేవతి భర్త భాస్కర్‌కు సినిమా అవకాశాలు ఇస్తామని ప్రకటించారు. 'రేవతి భర్త భాస్కర్‌ను సినిమా పరిశ్రమకు తీసుకువచ్చి ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు.
Also Read: Shyam Benegal: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను మంగళవారం ఎఫ్‌డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు పరామర్శించారు. అతడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి.. సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించారు' అని దిల్ రాజు తెలిపారు.
Also Read: Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు
'అమెరికాలో వేరే ప్రోగ్రామ్‌లో ఉన్నా. నిన్న వచ్చా. ఇవాళ రాగానే రేవంత్ రెడ్డిని కలిశా. రేవతి భర్త భాస్కర్‌ను ఇండస్ట్రీకి తీసుకుని వచ్చి ఏదో ఒక ఉద్యోగం ఏర్పాటు చేస్తాం. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటా' అని దిల్ రాజు హామీ ఇచ్చారు. ఎఫ్‌డీసీ ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తామని ప్రకటించారు. ప్రరభుత్వానికి పరిశ్రమకు మధ్యలో ఉండి భాస్కర్ కుటుంబాన్ని తాము బాధ్యత తీసుకుంటామని దిల్ రాజు చెప్పారు.
శ్రీ తేజ ఆరోగ్యం విషయమై దిల్ రాజు చెబుతూ.. 'శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతుంది. సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చా. రేవంత్ రెడ్డితో కూడా వీరి బాధ్యత తీసుకోవడంపై చర్చించా. సరే అన్నారు. ఇటువంటివి జరగటం దురదృష్టకరం. ఎవరూ కావాలని చేయరు' అని పేర్కొన్నారు. నేను అల్లు అర్జున్‌ను కలవబోతున్నట్లు ప్రకటించారు. 'సాంకేతికంగా భాస్కర్‌కు జరిగేవి అన్ని జరుగుతాయి. మేము అండగా నిలబడుతాం' అని దిల్ రాజు మరోసారి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.