Dil Raju Strategy: నాలుగు కోట్లు ఎక్స్ట్రా పెట్టినా రాబట్టేసిన దిల్ రాజు.. దసరా పండుగ చేస్తున్నాడే!
Dil Raju Strategy: నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేయగా ఆ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Dil Raju Strategy for Dasara: తెలుగులో దిల్ రాజుకి సక్సెస్ఫుల్ నిర్మాతగా మంచి పేరు ఉంది. ఒకపక్క సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగిన ఆయన ఆ తర్వాత దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆయన చేస్తున్న సినిమాల విషయంలో టాక్ పరంగా ఫ్లాప్ అనిపించుకుంటారేమో కానీ వసూళ్ల పరంగా ఏదో ఒక విధంగా సినిమాకి నష్టం చేసుకోకుండానే బయటపడతారు అన్న పేరు ఆయనకు ఉంది.
ఇప్పుడు దిల్ రాజు చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఈ హక్కులను చదలవాడ శ్రీనివాసరావు ముందుగానే కొనుగోలు చేశారు, అయితే ఆయన వద్ద నాలుగు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి మరీ కొనుగోలు చేసిన దిల్ రాజు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దిల్ రాజు ఉత్తరాంధ్ర, నైజాం ప్రాంతంలో సొంతంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు.
మిగిలిన ప్రాంతాల హక్కులు తాను పెట్టిన డబ్బుల్లో 70% వెనక్కి వచ్చేసేలాగా బిజినెస్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ దసరా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే సినిమా టీజర్ రిలీజ్ అయిందో అప్పుడే ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దీంతో నాలుగు కోట్ల రూపాయలు అదనంగా పెట్టి మరి దిల్ రాజు, ఈ హక్కులు దక్కించుకోవడమే కాక ఆ వసూళ్లను ముందే రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆయన దగ్గర ఉన్న హక్కులను చదలవాడ శ్రీనివాసరావు కొనుక్కుంటే ఆయనకు నాలుగు కోట్లు అదనంగా ఇచ్చి మరీ దిల్ రాజు దక్కించుకుని ఇప్పుడు విడుదలకు ముందే లాభాల బాట పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Javed Khan Amrohi Died: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!
Also Read: Agni Nakshatram Glimpse: రానా చేతుల మీదుగా అగ్ని నక్షత్రం గ్లింప్స్.. అదరకోట్టేసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook