Dil Raju to Target Mythri Movie Makers Again: 2023 సంక్రాంతి ఎట్టకేలకు ముగిసింది, తెలుగులో రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదలవగా తమిళ్ లో కూడా రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాయి. తమిళ హీరోల సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. వీటితో పాటు ఒక చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ ఐదు సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికీ ఈ సినిమాకి హౌస్ ఫుల్ షోలు నడుస్తున్నాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఒకరకంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో గొడవ పెట్టుకుని మరీ కావాలని తన వారసుడు సినిమాని సంక్రాంతికి దిల్ రాజు రంగంలోకి దించారనే ప్రచారం ఉంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సంక్రాంతి రేసులో మాత్రం దిల్ రాజు ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మరోసారి మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో అమీతుమీ తేల్చుకునేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.


వాస్తవానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ రెండు సినిమాలను స్వయంగా రిలీజ్ చేసుకుంది. దిల్ రాజుకి అడిగినా ఇవ్వకపోవడంతోనే ఆయన వారసుడు సినిమాని రిలీజ్ చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అజిత్ తెగింపు సినిమా అని కూడా రిలీజ్ చేశారు అనే ప్రచారం ఉంది. ఇప్పుడు తాజాగా అందుతున్న ప్రచారం మేరకు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా దిల్ రాజు థియేటర్లను బ్లాక్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి పుష్ప సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా అదే సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న శంకర్ సినిమాని రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


కచ్చితంగా తన సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ కి ఒక షాక్ ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతికి ఇంకా ఏడాది పైగా సమయం ఉండటంతో ఇది ఎంతవరకు నిజమవుతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఒక వేళ అంతకుముందే సినిమాలు కనుక పూర్తయితే ఆయా సమయాలను బట్టి రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: Waltair Veerayya Collections: ఇంత పాజిటివ్ టాక్ తోనూ 'సైరా'ను టచ్ లేకపోయిన వీరయ్య!


Also Read: Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook